Q:ఆర్య ,
సర్ , మా అమ్మకి బోదకాలు
ఉంది . గత 20 సంవత్సరాల నుండి బాధపడుతున్నారు .
ఇంగ్లీష్ మందులు వాడుతున్నారు
. స్వెల్లింగ్ లేదు . కాని వాపు అలానే ఉంది . అంతే కాదు జ్వరం తో బాధపడటం, కాలు వాయడం , ఎక్కువగా నడవలేకపోవడం , ఇలాంటి వాటితో
బాధపడుతున్నారు .
మేము ఎన్నో హాస్పిటల్
కి తీసుకెళ్ళాం . కాని ఇది తగ్గదు అని చెప్తున్నారు .
దయచేసి ఆయుర్వేదం లో
పూర్తిగా తగ్గే పరిష్కారం చెప్పమని కోరుకుంటున్నాను .
ఒకవేళ పేషెంట్ రావలసి
వస్తే , ఎన్ని రోజులు ఉండాలో , ఎక్కడకి రావాలో , మీరు లేదా మీకు తెలిసిన
మంచి హాస్పిటల్ చెప్పమని కోరుకుంటున్నాను .
మీ విధేయుడు
కాశి
A:
1) కరక్కాయ పొడి 100 గ్రాములు ,తిప్పసత్తు 100 గ్రాములు ---3 గ్రాముల పొడి భోజనానికి ముందు రోజుకు రెండు పూటలు గోమూత్రం లో కలిపి త్రాగాలి.(గోమూత్రం దొరకకపోతే గోదాన్ ఆర్కము పతంజలి shop లో దొరుకుతుంది )
2) పిప్పళ్ళు 100g , తెల్ల గలిజేరు వేరు 100 g,ఉసిరి 100g, కరక్కయులు 100g,తానికాయలు 100g,---5 గ్రాముల పొడి తేనెతో కలిపి
భోజనం తరువాత తినాలి
3) ఉమ్మెత్త ఆకులు 50g,తెల్ల గలిజేరు ఆకులు 50 g,ఆముదం ఆకులు 50g,వావిలి ఆకులు 50g,తెల్ల ఆవాలు 50g, మునగ చెట్టు బెరడు రసం50 g ---అన్నిటిని కలిపి బోదకాలు
ఫై రాయాలి.
40 రోజులు చేసిన తరువాత నాకు mail చెయ్యండి .
web: www.ayurbless.com