ఆర్యా,
ఈ మధ్యన నిదురపోయి లేచినపుడు తలత్రిప్పు కలుగుతున్నదని మా తమ్ముడు అంటున్నాడు. అతని వయస్సు 59. అతను కాకినాడలో ఉంటాడు.
మొన్న ఈ మధ్యన ఒకసారి కళ్ళుతిరిగి పడిపోయాడు. కంటిదగ్గర దెబ్బతగిలి black eye వచ్చింది. కంటికి ఏమీ దెబ్బతగల్లేదు లెండి. అతడికి Brain MRI వగైరా పరీక్షలు చేసారు - అంతా నార్మల్.
అతడికి తలత్రిప్పు ఎప్పుడు నిదురపోయి లేచినా అప్పుడు కలుగుతోందట కొద్దిసేపు.
అతడికి మధుమేహం, లేదు రక్తపుపోటూ లేదు.దీనికి తగిన వైద్యం సూచించగలరు.మీకు ఇంకేమైనా వివరాలు కావాలంటే తెలియజేయగలను.
భవదీయుడు
శ్యామలరావు
98496 26023
హైదరాబాదు.
ayurbless: 1) దూలగొండి చెట్టు వేరు -20 గ్రాములు కషాయం చేసి దానిలో ౩౦ నెయ్యి కలిపి రోజుకు రెండు పూటలు త్రాగితే 15 రోజుల్లో తగ్గును .
2) వస 1 గ్రాము ,అశ్వగంద 1 గ్రాము కలిపి పాలలో కలిపి నిద్ర పోయేముందు త్రాగాలి
వస ను 24 గంటలు నానబెట్టి తరువాత ఎండ బెట్టి పొడి చేసుకొని వాడాలి
దూలగొండి మొక్క ఫోటో మన website లో చుడండి
www.ayurbless.com
http://ayurbless.blogspot.in