ఆయుర్వేదం ఫై అమెరికా ఆసక్తి
వాషింగ్టన్
: భారత ప్రాచీన వైద్యం ఆయుర్వేదంపై అమెరికా ఆసక్తి కనబరుస్తోంది. వివిధ రకాల వ్యాధుల నివారణ విషయంలో ప్రత్యామ్నాయ వైద్య విధానాల వైపు దృష్టి సారిస్తున్న అమెరికన్ల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయుర్వేదంపై అధ్యయనం చేసేందుకు ప్రముఖ భారత-అమెరికన్ స్కాలర్ భస్వతి భట్టాచార్యను భారత్‌కు పంపించాలని అమెరికా నిర్ణయించింది. ఆమె వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఆయుర్వేదానికి సంబంధించిన పలు అంశాలపై అధ్యయనం చేస్తారు. ప్రస్తుతం అమెరికాలో రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించిన వ్యాధులే ఎక్కువగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయుర్వేదంలో రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించిన అంశాలపై భస్వతి ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
వచ్చేవారం భారత్ చేరుకోనున్న ఆమె.. పీటీఐ వార్తాసంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రస్తుతం వస్తున్న పలు రకాల వ్యాధులు, రోగాలను చక్కగా నయం చేసే ఎన్నో విధానాలు ఆయుర్వేదంలో ఉన్నాయని, కానీ వాటి గురించి ఎవరూ ఎందుకు పెద్దగా ఆసక్తి చూపడంలేదో తాను తెలుసుకోవాలనుకుంటున్నానని వెల్లడించారు. ఆయుర్వేదంలో బెనారస్ హిందూ వర్సిటీ.. హార్వర్డ్ లేదా స్టాన్‌ఫోర్డ్‌తో సమానమని వ్యాఖ్యానించారు. ప్రధాన వైద్య విధానంతో ఆయుర్వేద వైద్యం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని భస్వతి అభిప్రాయపడ్డారు. చాలామంది ఆయుర్వేదాన్ని వ్యాధి నిరోధక వైద్య విధానం అని అనుకుంటారని, కానీ అది రోగాన్ని నయం చేసి, స్వస్థత చేకూర్చే వైద్యం అని వివరించారు. కోల్‌కతాలో జన్మించిన భస్వతి భట్టాచార్య.. ఫార్మకాలజీలో కొలంబియా యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు. అనంతరం హర్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో అంతర్జాతీయ ప్రజారోగ్యంపై మాస్టర్స్ పట్టా సాధించారు.