ayurbless కు స్వాగతం.మీ సమస్యను send your problem page ఫై click చేసి మాకు పంపించండి. మీరు అడిగే ప్రతి సమస్యకు మేము సమాదానం mail చేస్తున్నాము కొందరికి reply వెళ్ళడం లేదు .mail రాని వారు "మీ ప్రశ్నలు -మా సమాదానాలు " page చూడగలరు .facebook ద్వారా మా team తో chat చేసి మీ సందేహాలు అడగవచ్చు ayur bless ఫై click చేసి add friend చేసుకొని మాతో chat చేయవచ్చు.

ప్రియమైన ayurbless వీక్షికులకు,

మీకు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చిన మాకు mail చెయ్యండి.send your problem అనే పేజీ ఫై click చేసి మాకు తెలియజేయండి.మీ సమస్య తీవ్రతను బట్టి మేము వేగంగా స్పందించి మీకు ఆయుర్వేద పరిష్కారం తెలుపుతాము.ఆయుర్వేదంలో పరిష్కారం కాని సమస్య ఏదిలేదు.

కాన్సర్ రోగులకు కూడా పరిష్కారం తెలుపుతున్నాం.మా ayurbless websiteను మీరు bookmark చేసుకోండి.

సంవత్సరం మొత్తం కొత్త పోస్టింగ్ లతో మీముందు వుంటుంది.blog లోలేని చాలా విషయాలు website లో ఉంచడం జరిగింది.www.ayurbless.com చూడగలరు.

diseases (వ్యాధులు )

                          


                     గ్యాస్ట్రిక్ క్యాన్సర్

 
HiResSuiteDocPatసాధారణంగా గ్యాస్ట్రిక్ అల్సర్లు క్యాన్సర్‌కు దారితీయవచ్చు. అయితే ఈ లక్షణాలు అల్సర్ ఏ స్థాయిలో ఉందన్న దాని మీద ఆధారపడి ఉంటాయి. మెదటి దశలో కడుపులో మంటగా ఉండటం ఏమైనా తినగానే కొంచెం సేపు తగ్గి, తర్వాత కొద్దిసేపటికి మళ్లీ కడుపులో ఇబ్బందిగా ఉండటం జరుగవచ్చు. రెండు వారాలు యాంటి బయాటిక్ మందులు వాడటం వల్ల ఈ అల్సర్ పూర్తిగా నయమవుతుంది.దాదాపు గ్యాస్ట్రిక్ అల్సర్స్‌లాగానే పొట్టకు సంబంధించిన క్యాన్సర్ లక్షణాలు ఉంటాయి. స్టమక్ క్యాన్సర్‌కు ప్రధాన కారణం కూడా దీర్ఘకాలికంగా ఉన్న అల్సర్. అందుకే ఒకసారి అల్సర్ వచ్చి తగ్గినవారు రెండోసారి అలాంటి లక్షణాలు కనిపించినా అల్సర్‌కు వాడిన మందులు వాడి తర్వాత తగ్గటం లేరదని డాక్టర్‌ను సంప్రదించడం జరుగుతుంది. అందుకనే ఇలాంటి లక్షణాలు కనిపించినపుడు ఎండోస్కోపీ, బయాప్సీ పరీక్షలు చేసి అనుమానంగా ఉంటే సీటీ స్కాన్, అల్ట్రాసౌండ్ ఎండోస్కోపీ పరీక్షలు చేసి స్థాయిని నిర్థారిస్తారు. పొట్టకు సంబంధించిన క్యాన్సర్ చికిత్స కూడా కణితి వచ్చిన ప్రదేశం, క్యాన్సర్ స్థాయి, వయసు, ఇతర ఆరోగ్యవిషయాలపై ఆధారపడి ఉంటాయి. పొట్టలో కణిత వచ్చిన ప్రదేశాన్ని బట్టి పొట్టలో కొంత భాగాన్ని తీసివేసి గ్యాస్ట్రెక్టమీ లేక పొట్టని మొత్తంగా తీసివేయటంతో పాటు చుట్టు ఉన్న లింఫ్‌నోడ్స్, చిన్న పేగులో కొంత భాగాన్ని అన్నవాహికలో కొంత భాగాన్ని తీసివేయటం జరుగుతుంది.

క్యాన్సర్‌ను కొంచెం ఆలస్యంగా గుర్తించినపుడు పొట్ట మొత్తాన్ని తీసివేసి అన్నవాహికను చిన్న పేగులతో కలిపి వేస్తారు. సర్జరీ తర్వాత ఆహారం తీసుకోలేక పోవడం, వాంతులు, వికారం, మలబద్ధకం, విరోచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. సర్జరీ ముందు చేసి తర్వాత కీమో, రేడియో థెరపీలు ఇచ్చినా లేక కీమోథెరపీ, రేడియోథెరపీ తర్వాత సర్జరీ చేసినా ఈ లక్షణాలు ఎక్కువగానే ఉంటాయి. పొట్టకు సంబంధించిన క్యాన్సర్ విషయంలో ఆహారం పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.
ఈ సర్జరీ తర్వాత సప్లిమెంట్లు, విటమిన్ డి, కాల్షియం, ఐరన్, విటమిన్ బి12 ఇంజక్షన్ల అవసరం చాలా ఎక్కువ.

MohanVamshi పొట్టని తీసివేసినపుడు ఆహారం నేరుగా చిన్నపేగులలోకి వెళ్లటం వల్ల డంపింగ్ సిండ్రోమ్ వస్తుంది. ఆహారం తక్కువగా, ఎక్కువ సార్లు తీసుకోవడం ఆహారం ముందు తర్వాత ద్రవపదార్థాలు తీసుకోవటం వంటి అనేక జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. క్యాన్సర్‌ను మరీ లేటుగా గుర్తించడం జరిగి కణితి ఆహారం తీసుకోవడానికి అడ్డంకుగా ఉన్నపుడు, లేజర్ థెరపి, రేడియేషన్ థెరపీలలో కణితిని చిన్నగా చేసి పేగులలో స్టంట్‌ను అమరుస్తారు. మెటల్ లేక ప్లాస్టిక్‌తో తయారయిన ఈ ట్యూబ్ ద్వారా ఆహారం జీర్ణవ్యవస్థలోకి వెళుతుంది. కాని ఇలాంటి పరిస్థితులు ఏర్పడినపుడు, క్యాన్సర్ మరీ ముదిరి ఇతర అవయవాలకు కూడా వ్యాప్తి చెంది ఉంటుంది. అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. స్టమక్ క్యాన్సర్ లక్షణాలు మొదటి దశలో అంత ప్రస్ఫుటంగా ఉండవు. అనుమానించేంత స్థాయిలో లక్షణాలు బయట పడ్డాయి అంటే క్యాన్సర్ స్థాయి పెరిగిందని అనుకోవాలి. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాపితంగా దాదాపు లక్షల మంది ఈ క్యాన్సర్ వల్ల మరణిస్తున్నారు.

హెలికో బ్యాక్టర్ పైలోరి బ్యాక్టీరియా దాదాపు 60 -0 శాతం వరకు ఈ క్యాన్సర్‌కు కారణం. ఇంకా స్మోకింగ్, మద్యం, జన్యుపరమైన కారణాలు దోహదపడ్తాయి. కాబట్టి అల్సర్‌కు సరియైన చికిత్సలు తీసుకోవడం తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తాజాగా ఉండే ఆహారం పరిశువూభమైన నీరు తీసుకోవడంతో పాటు దురలవాట్లకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం. కడుపుబ్బరం, తేన్పులు, మంట వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తే ఎవరికి వారు యాంటాసిడ్లు వాడటం కాకుండా ఒకసారి డాక్టర్ సలహా మేరకు ఎండోస్కోపి చేయించుకోవడం మంచిది.కడుపులో మంట, ఉబ్బరం, పుల్లటి తేన్పులు, అజీర్తి ఇలాంటి లక్షణాలు ఎప్పుడో ఒకప్పుడ అందరూ ఎదుర్కొనేవే అయితే ఈ లక్షణాలు తరచుగా కనిపిస్తున్నా సరియైన పరీక్షలు, అవసరమైన మందులు వాడటం తప్పనిసరి అని అర్థం చేసుకోవడం మంచిది.

                 థైరాయిడ్ క్యాన్సర్

హార్మోన్లు విడుదల చేసే గ్రంథులలో అతి పెద్ద గ్రంథి థైరాయిడ్. మెడ కింది భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఈ గ్రంథి జీవ ప్రక్రియలను అన్నింటిని నియంవూతిస్తుంది. అందుకే బాగా బరువు పెరిగినా, తగ్గినా, జుట్టు ఎక్కువగా రాలినా, అవాంఛిత రోమాలు వచ్చినా, గుండెదడ, నెలసరి సరిగ్గా లేకపోవడం, కళ్లు బయటకు వచ్చినట్టు ఉండటం, మానసిక స్థితిలో మార్పులు (మూడ్ డిజార్డర్స్) లాంటి లక్షణాలు కనిపిస్తే థైరాయిడ్ హార్మోన్‌లో హెచ్చు తగ్గులను తెలిపే టి3, టి4, టిఎస్‌హెచ్ పరీక్షలను చేయించుకోవడం తప్పనిసరి. అంతేకాకుండా ఈ గ్రంథి కాల్షియంను నియంవూతించే కాల్సిటోనిన్ అనే హార్మోన్‌ను కూడా విడుదల చేస్తుంది. అయితే పై సమస్యలన్నీ థైరాయిడ్ గ్రంథి పనితీరుకు సంబంధించినవి.

మహిళల్లో ఎక్కువ..

థైరాయిడ్ గ్రంథి మీద ఒక గడ్డ ఏర్పడి అపరిమితంగా పెరగడమే థైరాయిడ్ క్యాన్సర్. చాలామందిలో వయసు పెరిగే కొద్దీ కనిపించే ఈ కణుతులు 95 శాతం వరకు క్యాన్సర్‌కు సంబంధించినవి. కావు. అయితే జన్యుమార్పులు, ఏ కారణం వల్లనైనా ఎక్కువగా రేడియేషన్‌కు గురయినా, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్‌కు బాగా దగ్గరలో ఉన్నా, కుటుంబంలో ఎవరికైనా గాయిటర్ (థైరాయిడ్ గ్రంథి వాపు) లాంటి థైరాయిడ్ సమస్యలున్నా థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.
పురుషుల్లో కన్నా మహిళలు దీని బారినపడే అవకాశం మూడు రెట్లు ఎక్కువ. అందుకే మహిళలు మరింత జాగ్రత్తగా ఉండాలి. దీన్ని ఎంత తొందరగా గుర్తించగలిగితే అంత సులభంగా నయం చేయవచ్చు.

వెయ్యి మందిలో ఒకరు..
ఆసియా దేశాల్లో స్త్రీలలో ఎక్కువగా థైరాయిడ్ క్యాన్సర్ అయిదు రకాలు. పాపిలరీ థైరాయిడ్ క్యాన్సర్ (0 శాతం థైరాయిడ్ క్యాన్సర్లు ఇవే), ఫాలిక్యులార్ థైరాయిడ్ క్యాన్సర్, మెడ్యులరీ థైరాయిడ్ క్యాన్సర్, ఎనోప్లాస్టిక్ థైరాయిడ్ క్యాన్సర్ (అరుదుగా కనిపించే ఈ క్యాన్సర్ చాలా తీవ్రమైంది), థైరాయిడ్ లింఫోమా (ఇది కూడా అరుదైనదే).
మనదేశంలో తమిళనాడు, ఆంధ్రవూపదేశ్, కేరళ, తీరవూపాంతాల్లో ఉండేవారికి పాపిలరీ క్యాన్సర్లు ఎక్కువగా వస్తున్నాయి. పిల్లలు రేడియేషన్‌కు గురయితే ఇది వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. హిరోషిమా, నాగసాకి బాంబు ప్రమాదాలు, చెర్నోబిల్ ప్రమాదం నుంచి బయటపడినవారిలో పది సంవత్సరాల తరువాత కూడా ప్రతి వెయ్యిమందిలో 62 మంది దీనికి గురయ్యారు.



              లివర్ క్యాన్సర్ 

 brainహెపటో లేదా హెపాటిక్ అని అంటుండడం వింటూనే ఉంటాం. దీనికి అర్థం కాలేయం అని జీవవూపక్షికియలలో కీలక పాత్ర పోషించే మన కాలేయం దాదాపు 500 రకాలకు పైగా క్రియలను నిర్వర్తించి పునరుత్పత్తి శక్తి కలిగిన ఏకైక అవయవం. మన శరీరం లోపలి అవయవాలలో అతి పెద్ద అవయవమైన కాలేయాన్ని అతి పెద్ద గ్రంథిగా కూడా పేర్కొనవచ్చు. నాలుగు భాగాలుగా విభజించబడి ఉండే కాలేయం దాదపు ఒకటిన్నర కిలోల వరకు బరువు ఉంటుంది.

విషతుల్యమైన పదార్థాల వల్ల కలుషితమైన ఆహారం, నీరు, మద్యం, స్మోకింగ్ వల్ల కాలేయం మీద ప్రభావం పడి వాపునకు గురవుతుంది. దానిని హెపటైటిస్ అంటారు. హెపటైటిస్‌కు గురిచేసే వైరస్‌లు ఎ, బి, సి, డి, ఇ అని ఐదు రకాలుగా ఉంటాయి. వీటిలో బి, సి, వైరస్‌లు ప్రమాదకరమైనవి. రక్త మార్పిడి వల్ల, అరక్షిత శృంగారం ద్వారా, తల్లి నుండి బిడ్డకు ఈ వైరస్‌లు సోకకుండా మూడు డోసుల వ్యాక్సిన్ వేయించుకోవాలి. హెపటైటిస్‌బి పాజిటివ్ ఉన్నవారు కూడా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. పిల్లలకు వారి టీకా షెడ్యూల్ ప్రకారం వ్యాక్సిన్ వేయిస్తే చాలా మంచిది. ఆకలి తగ్గటం, వికారం, కామెర్లు, జ్వరం, కీళ్లనొప్పులు వంటి సమస్యలు ఉన్నపుడు చెట్ల వైద్యం, నాటు వైద్యం వంటి సొంత వైద్యాలు చేసుకోకుండా కారణం తెలుసుకుని అవసరమైన చికిత్స తీసుకోవడం ఉత్తమం. లివర్ ఇన్‌ఫెక్షన్స్ ఫ్యాటి లివర్, లిర్ వెబ్‌సెస్, విల్సన్ డిసీజ్, గిల్‌బర్డ్ సిండ్రోమ్ వంటి అనేక రకాల కాలేయ సంబంధిత వ్యాధులున్నా వీటిలో హెపటైటిస్ బి, సి, వైరస్ కలుగజేసే ఇన్‌ఫెక్షన్లు కొన్ని సంవత్సరాల తర్వాత కాలేయనాన్ని గాయపరచడం, గట్టిగా మార్చడం(సిపూరోసిస్) తర్వాత క్యాన్సర్‌కు దారితీయటం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. అందుకే ఆసియా దేశాలలో హెపటైటిస్-బి, ఇన్‌ఫెక్షన్లు ఎక్కువ కాబట్టి లిర్ క్యాన్సర్స్ ఎక్కువే. లివర్ క్యాన్సర్‌లో హెపటోసెల్యులార్ కార్సినోమా, మెటాస్టామిక్ లివర్ క్యాన్సర్ అనే రెండు రకాలుంటాయి. జీర్ణవ్యవస్థలో క్యాన్సర్లు, బ్రెస్ట్ క్యాన్సర్స్ బోన్ క్యాన్సర్లు, ఇలా ఏ క్యాన్సర్స్ అయినా కాలేయానికి వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువ. లేటుగా బయటపడే లివర్ క్యాన్సర్ చాలా ప్రమాదకరమైనదిగా పేర్కొనవచ్చు.

Dr.mohanపొట్ట సంబంధిత క్యాన్సర్లు, లంగ్ క్యాన్సర్లు తర్వాత లివర్ క్యాన్సర్లు ఎక్కువ. ఇండియా, చైనా, హాంగ్‌కాంగ్, తైవాన్, కొరియా, సౌత్ ఆఫ్రికాలలో హెపటైటిస్ -బి, ఇన్‌ఫెక్షన్ల వల్ల ఈ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తుంది. అమెరికా, యూరప్‌లో ఈ క్యాన్సర్ తక్కువే అయినా హెపటైటిస్ - సి, వైరస్‌వల్ల అధికబరువు, మధుమేహం వంటి సమస్యల వల్ల ఈ క్యాన్సర్‌కు గురయ్యే వారి సంఖ్య ఈ దేశాలలో కూడా ఈ మధ్య పెరుగుతూ వస్తోంది. అమెరికా వంటి దేశాలలో స్థిరపడిన ఆసియా దేశస్థులలో హెపటైటిస్-బి ఇన్‌ఫెక్షన్ వైరస్ వల్ల లివర్ క్యాన్సర్ ఎక్కువగా ఉంటోంది. పుట్టినపుడే ఈ ఇన్‌ఫెక్షన్ ఉన్నా 30, 40 ఏళ్లలో లక్షణాలు బయటపడడం, క్యాన్సర్‌కు గురవటం జరుగుతుంది. పురుషులలో ఎక్కువగా కనిపించే ఈ క్యాన్సర్, హెపటైటిస్ బి పాజిటివ్‌కు ఆల్కహాల్ తోడయితే త్వరగా ముదిరిపోవడం, చికిత్సకు లొంగకపోవడం జరుగుతూ ఉంటుంది
                          క్యాన్సర్‌కీ వ్యాక్సిన్

 
cervicalభారతదేశంలో సర్వైకల్ క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. భాదతదేశంలో ఏటా 1లక్షా34వేల పైచిలుకు క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ఈ సంఖ్య 2025 నాటికి 2 లక్షల పై చిలుకుకు చేరవచ్చని అంచనా. సర్వైకల క్యాన్సర్ వ్ల ఏటా మరణిస్తున్న వారి సంఖ్య 72 వేల 8 వందల పై మాటే.

సర్వైకల్ క్యాన్సర్ అంటే ...
గర్బాశయ ముఖద్వారం వద్ద వచ్చే క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అంటారు. గర్భాశయ ముఖద్వారం అనేది గర్భాశయానికి క్రింది భాగంలో ఉండే సన్నని ప్రదేశం. ఇది పేరుకు తగ్గట్టుగా గర్భాశయానికి ముఖద్వారం లాటా పని చేస్తుంది. ఇది గర్భాశయాన్ని, యోనితో కలిపి ఉంచుతుంది. గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్‌ను మిగతా అన్ని రకాల క్యాన్సర్‌ల కన్నా సులభంగా నివారించవచ్చు. క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడమే దీనిక ఉత్తమ పరిష్కార మార్గం. సర్వైకల్ క్యాన్సర్‌కు చకిత్స చేయడం కూడాచాలా సులభం అయితే దీనిని ఎంత ముందుగా గుర్తిస్తే అంత సులభంగా చికిత్స చేయవచ్చు. సర్వైకల్ క్యాన్సర్ అ1నేది 50 సంవత్సరాలు నిండిన మహిళలలో ఎవరికైనా రావచ్చు.

కారణాలు

హ్యూమన్ పాపిలోమా వైరస్ అనే వైరస్ సర్వైకల్ క్యాన్సర్ ముఖ్యకారణం. ఈ వైరస్ సెక్స్ ద్వారా ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వ్యాప్తి చెందుతుంది. దాదాపు సగం మంది జనాభా జీవితంలో ఏదో ఒక సమయంలో హెచ్‌పీవీ వైరస్ కలిగి ఉంటారు. అయితే అందరిలోను ఇది సర్వైకల్ క్యాన్సర్‌కు దారి తీయదు. కేవలం కొంతమంది మహిళలకు మాత్రమే క్యాన్సర్ రావచ్చు. సెక్స్‌లో పాల్గొన్న ప్రతి వారికి హెచ్‌పీవీ వైరస్ సోకే అవకాశాలు ఉంటాయి. అయితే తక్కువ వయసులోనే సెక్స్‌లో పాల్గొనటం మొదలు పెట్టిన స్త్రీలు, లేదా వారు కాని వారి భాగస్వాములు గాని ఎక్కువ మందితో సెక్స్‌లో పాల్గొన్న సందర్భాల్లో హెచ్‌పీవీ సోకే అవకాశం మరీ ఎక్కువ. హెచ్‌పీవీ వైరస్‌లలో అనేక రకాలు ఉంటాయి.సాధారణంగా హెచ్‌పీవీ దానంతట అదే నశించి పోతుంది. ఒకవేళ నశించక పోతే కొంత కాలం తర్వాత క్యాన్సర్‌కు దారి తీయవచ్చు. పాప్ పరీక్ష అనేది అత్యంత ఆధారపడదగిన ఉపయుక్తమైన క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష. మీ వయసు 21 సంవత్సరాలు నిండనా లేదా సెక్స్‌లో పాల్గొనటం మొదలు పెట్టి 3 సంవత్సరాలు గడిచినా క్రమం తప్పకుండా పాప్ పరీక్షలు చేయించుకోవాలి.
MohanVamshi

హెచ్‌పీవీ వ్యాక్సిన్

శక్తివంతమైన వైరస్, బాక్టీరియాలను తట్టుకోవడానికి మన శరీరం యాంటీబాడిస్‌ను తయారు చేస్తుంది. అయితే హెచ్‌పీవీ వైరస్ విషయంలో మన శరీరం ఎటువంటి యాంటిబాడాలను తయారు చేయదు. దాని వల్ల ఇన్‌ఫెక్షన్ జీవితాంతం ఉండిపోతుంది. అది సర్వైకల్ క్యాన్సర్‌కు దారి తీయవచ్చు. హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇప్పించడం వల్ల అది శరీరంలో యాంటిబాడిలను తయారు చేసి హెచ్‌పీవీ వైరస్ నుంచి శరీరాన్ని కాపాడుతుంది. హెచ్‌పీవీ వ్యాక్సిన్ యోని మరియు గర్భాశయ ముఖద్వారం వద్ద వచ్చే క్యాన్సర్‌లను నివారించడానికి తోడ్పడుతుంది. అమెరికన్ క్యాన్సర్ ఇనిస్ట్యూట్ వారి సిఫారసు ప్రకారం 11 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపిల్లకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇప్పించాలి. అయితే 9 సంవత్సరాటు నిండిన ఆడపిల్లల నుంచి 18 సంవత్సరాల వరకు ఈ వ్యాక్సిన్ ఇప్పించవచ్చు. ఈ వ్యాక్సిన్‌ను 6నెలల వ్యవధిలో 3 సార్లు ఇప్పించాలి. దీని వల్ల సర్వైకల్ క్యాన్సర్‌ను నివారించవచ్చు.



          ప్రొస్టేట్ క్యాన్సర్ prostateca talangana patrika telangana culture telangana politics telangana cinema 

మగవారిలో ప్రొస్టేట్ గ్రంథికి సోకే క్యాన్సర్‌ను ప్రొస్టేట్ క్యాన్సర్ అంటారు. ప్రొస్టేట్ గ్రంథి వాల్‌నట్ ఆకారంలో ఉండే చిన్న గ్రంథి. వీర్యంలో కనబడే ద్రవపదార్థాన్ని ఇది తయారు చేస్తుంది. వీర్యకణాలను మోసుకెళ్లడానికి ఈ ద్రవపదార్థం ఉపయోగపడుతుంది. ప్రొస్టేట్ క్యాన్సర్ నెమ్మదిగా పెరుగుతుంది. మొదటిదశలో ఇది ప్రొస్టేట్ గ్రంథికి మాత్రమే పరిమితమై ఉంటుంది. ఇటువంటి పరిస్థితులలో చికిత్స అవసరం అతి తక్కువగా ఉంటుంది. లేదా అసలు అవసరం రాకపోవచ్చు.

కానీ కొన్ని రకాల ప్రొస్టేట్ క్యాన్సర్లు వేగంగా విస్తరిస్తాయి. ప్రొస్టేట్ క్యాన్సర్‌ను ముందుగానే అంటే గ్రంథికి పరిమితమైన దశలోనే గుర్తిస్తే చికిత్స సులభవుతుంది. అయితే ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రారంభదశలో ఎటువంటి లక్షణాలు బయట పడకపోవచ్చు. వ్యాధి తీవ్రమైన దశలో మూత్ర విసర్జనలో ఇబ్బంది, మూత్రంలో లేదా వీర్యంలో రక్తం పడటం, మూత్రం ధారగా రాకపోవడం, కాళ్లవాపు, ఎముకలలో నొప్పి, పొత్తికడుపు ఇబ్బందిగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ప్రొస్టేట్ క్యాన్సర్ రావడానికి కచ్చితమైన కారణాలు చెప్పలేము. వయసు మీద పడటం కుటుంబంలో ఇకరికైనా ప్రొస్టేట్ క్యాన్సర్ ఉండటం స్థూలకాయం వంటివి కారకాలు కావడానికి అవకాశం ఉంది. ప్రొస్టేట్ క్యాన్సర్‌ను విస్మరిస్తే అది ఇతర భాగాలకు వ్యాపించడం, అంగస్తంభన సమస్యలు మొదలైనవి రావడానికి అవకాశం ఉంది. ఎన్నో అంతర్జాతీయ సంస్థలు 50 సంవత్సరాలు పైబడిన పురుషులను ప్రొస్టేట్ స్క్రీనింగ్ పరీక్ష చేయించుకోమని సలహా ఇస్తున్నారు. డిజటల్ రెక్టల్ ఎగ్జామ్, ప్రొస్టేట‚ స్పెసిఫిక్ ఆంటిజన్ పరీక్షను చేయం వల్ల వ్యాధి ముందుగానే గుర్తించవచ్చు. ఈ పరీక్షలలో వ్యాధి ముందుగానే గుర్తించవచ్చు. ఈ పరీక్షల ఫలితాను బట్టి అల్ట్రా సౌండ్, బయాప్సీ పరీక్షలు చేయించుకోవాలి.

బయాప్సీలో పాజిటివ్‌గా వస్తే గ్రేడింగ్ చేయాలి. అంటే వ్యాధి తీవ్రత ఏ దశలో ఉందో గుర్తించాలి. ఇందుకోసం క్యాన్సర్ కణాలను ఆరోగ్యంగా ఉన్న ప్రొస్టేట్ కణాలతో పోల్చి చూస్తారు. క్యాన్సర్ కణాలు ఆరోగ్యకరమైన కణాలకన్నా ఎంత ఎక్కువ భిన్నంగా ఉంటే అంత తీవ్రంగా వ్యాధి ఉన్నట్లు. వ్యాధి తీవ్రతను కొలిచే కొలమానాన్ని గ్లీసన్ స్కోర్ అంటారు. ఈ సోకర్ 2నెంచి 10 వరకు ఉంటుంది. 2 ఉంటే తీవ్రత తక్కువగా ఉన్నట్లు 10 ంటే తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్లు.
Vamsi0 talangana patrika telangana culture telangana politics telangana cinema

క్యాన్సర్ వ్యాప్తిని గుర్తిండచం
క్యాన్సర్ వ్యాధి ప్రొస్టేట్ గ్రంథిని దాటి ఇతర అవయవాలకు వ్యాప్తి చెందినది అని అనుమానం కలిగితే మరిన్ని పరీక్షలు చేయాల్సి వస్తుంది.

ఆపరీక్షలు ఏంటంటే ఎముకల స్కానింగ్, కంప్యూటరైజ్డ్ టోమోక్షిగఫి, స్కాన్, మాగ్నటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్ వంటివి. ఈ పరీక్షల వల్ల క్యాన్సర్ ఏ స్టేజ్‌లో ఉందో నిర్థారణ అవుతుంది.

క్యాన్సర్ ఉండే స్టేజీలు
స్టేజ్ 1 : మొదటి స్టేజ్ లో ఉంది అంటే క్యాన్సర్ చాలా ప్రాథమిక దశలో ఉన్నదని అర్థం.
స్టేజ్2 : ఈ దశలో క్యాన్సర్ సులభంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రొస్టేట్ గ్రంథికి మాత్రమే పరిమితమై ఉంటుంది.
స్టేజ్ 3 : ఈ దశలో క్యాన్సర్ ప్రొస్టేట్ గ్రంథిని దాటి వీర్య వాహికలు లేదా ఇతర సమీప కణజాలానికి పాకి ఉండవచ్చు.
స్టేజ్ 4 : ఈ దశలో క్యాన్సర్ లింఫ్ గ్రంథులు ఎముకలు, ఊపిరితిత్తులు, ఇతర అవయవాలకు పాకి ఉంటుంది.


                  కేన్సర్ చికిత్సలో తేడాలుంటాయి
 
- వ్యక్తులకు అనుగుణంగా చికిత్స
- డాక్టర్ సీహెచ్ మోహన వంశీ

హైదరాబాద్, జూన్ 30 ( టీ మీడియా) : రోగి వయస్సు, వారి ఆరోగ్య లక్షణాలు, కేన్సర్ స్థాయి, గ్రేడింగ్ ఇలాంటి అనేక విషయాల మీద కేన్సర్‌కు చికిత్స ఉంటుందని ఒమేగా ఆస్పత్రి సర్జికల్ ఆంకాలజిస్టు విభాగం చీఫ్ డాక్టర్ సీహెచ్ మోహన వంశీ తెలిపారు. ఒక్కోసారి రోగి శరీరతత్వాన్ని బట్టి కేన్సర్ చికిత్సా విధానాలు మారుతుంటాయని వెల్లడించారు. కొన్ని కేన్సర్ మందులకు, రేడియేషన్‌కు కొంతమందిలో కంట్రోల్‌లోకి వస్తే మరికొంత మందిలో అవి ఏ విధంగానూ పని చేయమని చెప్పారు. బ్రెస్ట్ కేన్సర్, ప్రొస్టేట్ కేన్సర్ వంటి వాటికి సర్జరీ, రేడియేషన్, కీమో థెరపీలతో పాటు హార్మోన్ థెరపీకి ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. కేన్సర్‌కు ప్రస్తుతం సెల్ టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునో థెరపి, హైపర్ థర్మియా, స్టెమ్‌సెర్ థెరపీ, ఫొటో డైనమిక్, లేజర్ థెరపీ, మాలిక్యూలర్ టార్గెటెడ్ థెరపి వంటి అనేక కొత్త చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయని మోహనవంశీ చెప్పారు.

అయితే ఇవి చాలా ఖర్చుతో కూడుకున్నవని, ఇవి పేదలకు అందుబాటులోకి లేవని చెప్పారు. చికిత్సను కొన్ని సందర్భాలలో అదుపులో ఉంచేందుకు, నయం చేసేందుకు గాకుండా చివరి స్టేజీలో కనుగొన్నప్పుడు కొంత వరకు నొప్పి, బాధ తగ్గేంచుకు కూడా ఉయోగిస్తారని చెప్పారు. కేన్సర్ చికిత్స తీసుకునే వారికి గుండె, మూత్రపిండాలు, కాలేయం పనితీరు సరిగ్గా ఉండటం చాలా ముఖ్యమని చెప్పారు. రక్తానికి సంబంధించిన కేన్సర్ మినహా ఇతర ఏ కేన్సర్‌లోనైనా సర్జరీ ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుందన్నారు. సర్జరీల్లోనూ ప్రివెంటివ్ సర్జరీ, క్యూరేటివ్ సర్జరీ, పాలియేటివ్ సర్జరీ, రిస్టోరేటివ్ సర్జరీ, రిస్టోరేటివ్ సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ వంటివి ఉంటాయని వెల్లడించారు.

                            బట్టతలకు గుడ్‌బై

 
అప్పుడే జుట్టంతా ఊడిపోయింది. బట్టతలతో నలుగురిలో తిరగలేకపోతున్నాను. ఎన్ని మందులు వాడినా జుట్టు రావడం లేదు. హెయిర్ ట్రాన్స్‌ప్లాం చేయించుకుందామంటే దాని గురించి సరియైన వివరాలు చెప్పేవారే లేరు. అంటూ చాలా మంది బాధపడి పోతుంటారు.

హెయిర్ ట్రాన్స్‌ప్లాం క్లిష్టమైన ప్రక్రియ. చాలా జాగ్రత్తగా, ఓపికతో చేయాల్సిన సర్జరీ ఇది. ఈ రోజుల్లో హెయిర్ ట్రాన్స్‌ప్లాం చాలా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కోరకమైన హెయిర్ స్టయిల్ ఉంటుంది. దానికనుగుణంగా డాక్టర్లు కొత్త పద్ధతులు అభివృద్ధి పరుస్తున్నారు. అయితే హెయిర్ ట్రాన్స్‌ప్లాం చాలా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కోరకమైన హెయిర్ స్టయిల్ ఉంటుంది. దానికనుగుణంగా డాక్టర్లు కొత్త పద్ధతులు అభివృద్ధి పరుస్తున్నారు. అయితే హెయిర్ ట్రాన్స్‌ప్లాం చేయించుకోవాలనుకుంటున్న వ్యక్తి ముందుగా మంచి పేరున్న నిపుణులైన డాక్టర్‌ను కలవాలి. డాక్టర్‌ను కలిసినపుడు హెయిర్‌లాస్ ఏ మేరకు ఉంది? శిరోజాలు రాలకుండా ఉండాలంటే ఏం చేయాలి? హెయిర్ ట్రాన్స్‌ప్లాం ఎంత భాగం చేయాలి? తదితర అంశాలను పరిశీలించి సూచనలు చేస్తారు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాలనుకుంటున్న వ్యక్తి తలలో నుంచే శిరోజాలను తీసుకోవడం జరుగుతుంది. అందుకే పూర్తి సహజసిద్ధంగా ఎవరూ గుర్తుపట్టలేనంతగా ఉంటుంది.
Rao talangana patrika telangana culture telangana politics telangana cinema
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్‌లో రెండు ముఖ్యమైన పద్ధతులు ఉన్నాయి. స్ట్రిప్ లేదా ఎప్‌యూఈ(ఫోలిక్యూలార్ యూనిట్ ఎక్స్‌వూటాక్షన్) సర్జరీ కోసం ఒకరోజంతా క్లినిక్‌లోనే ఉండాల్సి ఉంటుంది. కొన్ని గంటల పాటు సర్జరీ జరుగుతుంది. ఈ సర్జరీకి లోకల్ అనస్థీషియా సరిపోతుంది. అంటే క్లయింట్ సర్జరీ జరుగుతున్నంత సేపు మెలకువగానే ఉంటాడు. ఎఫ్‌యూఈ పద్ధతిలో ఒక్కో తీసుకుని బట్టతల ప్రాంతంలో అతికించడం జరుగుతుంది. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత ఎర్రగా మారడం, వాపు ఉంటాయి. కొన్ని వారాల తర్వాత ఇవి తగ్గిపోతాయి. ట్రాన్స్‌ప్లాంట్ చేసిన తర్వాత శిరోజాలు రాలిపోతాయి. కానీ అక్కడి నుంచే కొత్త జుట్టు పెరగడం మొదలవుతుంది. శిరోజాలు తీసే స్థలంలో, అతికించే స్థలంలో అనస్తీషియా ఇవ్వడం జరుగుతుంది. దీని వల్ల నొప్పి ఏ మాత్రం తెలియదు.

ముందు జాగ్రత్తలు
పొగతాగడం, ఆల్కహాల్ తీసుకోవడం, ఇతర మందులు వాడే అలవాటు ఉంటే సర్జరీకి కొన్ని వారాల ముందు నుంచి ఆపేయాలి. దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి. అధికంగా మద్యం సేవించడం, ఇతర వ్యాధులకు వాడే మందుల వల్ల సర్జరీ సమయంలో లేదా తర్వాత బ్లీడింగ్ కావడానికి అవకాశం ఉంటుంది. అందుకే సర్జరీ చేయించుకోవాలని అనుకుంటున్న వారు తప్పనిసరిగా ఈ అలవాట్లను మానుకోవాలి.

ఎంత సమయం పడుతుంది?
ఒక సెషన్ 1500 నుంచి 3 వేల వరకు శిరోజాలను తీసి అతికించవచ్చు. రోజంతా సర్జరీ చేసినపుడు ఇది సాధ్యమవుతుంది. చాలా వరకు పేషెంట్స్ ఉదయం క్లినిక్‌కు వస్తే సాయంవూతానికల్లా ఇంటికి వెళ్లిపోవచ్చు.

ఎంత సమయం పడుతుంది
హెయిర్ ట్రాన్స్‌ప్లాం చేయించుకోగానే నిండైన జుట్టుతో అందంగా కనిపించాలని కోరుకుంటారు. కానీ దానికి సమయం పడుతుందని గుర్తుంచుకోవాలి. ట్రాన్స్‌ప్లాంట్ చేసిన శిరోజాలు నెమ్మదిగా పెరుగుతాయి. సర్జరీ చేసిన కొన్నివారాల తర్వాత ట్రాన్స్‌ప్లాంట్ హెయిర్ రాలిపోతాయి. ఆ తర్వాత నెమ్మదిగా పెరగడం మొదలవుతుంది. మూడు నెలల్లో మెల్లగా శిరోజాలు పెరుగుతుండడం గమనించవచ్చు. ఆరు నెలల నుంచి ఏడాదిలోపు జుట్టు పూర్తిగా పెరుగుతుంది. సర్జరీకి ముందు సర్జరీ తర్వాత తేడాను స్పష్టంగా గమనించవచ్చు. ఈ జుట్టు పూర్తిగా సాధారణ జుట్టు మాదిరిగానే ఉంటుంది.

ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉండదు. మామూలుగా దువ్వుకోవడం చేయవచ్చు. ఈ జుట్టు ఊడిపోవడం మళ్లీ బట్టతల రావడం అంటూ జరగదు. ట్రాన్స్‌ప్లాంట్ చేసిన జుట్టు జీవితాంతం నిగనిగలాడుతూ ఉంటుంది. బట్టతల సమస్యకు హెయిర్ ట్రాన్స్‌ప్లాం సర్జరీ ఒక వరం. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్‌తో బట్టతలకు శాశ్వతంగా గుడ్‌బై చెప్పవచ్చు.


ప్రొస్టేట్ సమస్యకు టీయూఆర్‌ఐ
ptostate
ప్రొస్టేట్ గ్రంథి వాయడం వల్ల కలిగే మూత్రనాళ సమస్యలకు సులువైన పరిష్కారం చూపే చికిత్స ట్రాన్స్‌యువూతల్ రిసెక్షన్. ఈ చికిత్సలో ప్రొస్టేట్ కణజాలాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసేసి తీసేస్తారు. దీనివల్ల మూత్రమార్గంలో అడ్డంకు తొలగిపోయి ఆయా సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ సర్జరీ పూర్తిగా నాన్ ఇన్వేసివ్. అంటే గాటు పెట్టనవసరం ఉండదు. సాధారణ మూత్రమార్గం ద్వారానే ఈ చికిత్స చేయవచ్చు.

ఎప్పుడు చేయాలి?
- మూత్రసమస్యలు కంట్రోల్ చేయలేనంత తీవ్రంగా ఉన్నప్పుడు. మందులు వాడితేనో, ఇతరత్రా మార్పులు చేసుకుం తప్ప ఈ సమస్యలు తగ్గడం లేదంటే టీయూఆర్‌పీ చేయాలి.
- మూత్రవిసర్జన కష్టం కావడం. ట్యూబు ద్వారా తప్ప మూత్ర విసర్జన కష్టం చేయలేకపోవడం
- మూత్రద్వారంలో అడ్డంకు వల్ల బ్లాడర్‌లో పీడనం పెరుగుతుంది. దీనివల్ల కిడ్నీ కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉన్నప్పుడు
- ప్రొస్టేట్ గ్రంథి వాపు వల్ల పదే పదే మూత్రనాళంలో ఇన్‌ఫెక్షన్లు వస్తున్నప్పుడు
- ఎన్ని మందులు వాడినా ప్రొస్టేట్ గ్రంథి నుంచి రక్తవూసావం అవుతున్నప్పుడు
- బ్లాడర్‌లో రాళ్లు ఉన్నప్పుడు

లాభాలేంటి?
టీయూఆర్‌పీ చికిత్స తీసుకున్నవారిలో 90 శాతం మంది ప్రొస్టేట్ సమస్య నుంచి పూర్తిగా బయటపడతారు. బలహీనపడిన బ్లాడర్ కూడా బాగవుతుంది. సంకోచవ్యాకోచాలు సక్రమంగా జరుగుతాయి. ఆపరేషన్ తరువాత మూత్రవిసర్జన కోసం కష్టపడాల్సిన అవసరం ఉండదు. మూత్రవిసర్జన కోసం పదే పదే నిద్రలో లేవాల్సిన పనిలేదు. అయితే ఈ సమస్య పూర్తిస్థాయిలో పోవాలంటే మూడు నుంచి ఆరు నెలల సమయం పడుతుంది. టీయూఆర్‌పీ చికిత్స ఇతర ప్రొస్టేట్ చికిత్సల కన్నా ఉపయోగకరమైనది.
- ప్రొస్టేట్ కణజాలాన్ని అతి వేగంగా తీసివేయడం సాధ్యమవుతుంది.
- ఇతర ఆపరేషన్లతో కలిపి దీన్ని కూడా నిర్వహించవచ్చు. ఉదాహరణకి బ్లాడర్‌లో రాళ్లు తీసేయడం సాధ్యమవుతుంది.

రిస్కు ఉందా?
వయసు పైబడినవాళ్లు, మధుమేహ వ్యాధిక్షిగస్థులు, బీపీ, కరొనరీ జబ్బులు ఉన్నవారిలో ఈ ఆపరేషన్ కొంతవరకు కష్టమైనదే. ఇలాంటివాళ్లకు ఆసుపవూతిలో మరింత శ్రద్ధ, ప్రత్యేకమైన సదుపాయాలు అవసరమవుతాయి.

పరీక్షలు
టీయూఆర్‌పీ చికిత్సకు ముందు సాధారణంగా ఎటువంటి పరీక్షలు అవసరం లేదు. కానీ మూత్రసమస్యలకు ప్రొస్టేట్ మాత్రమే కాకుండా ఇతర కారణాలు కూడా ఉండొచ్చన్న సందేహం ఉన్నప్పుడు మాత్రం సిస్టోస్కోపీ లాంటి పరీక్షలు చేయాల్సి వస్తుంది. సిస్టోస్కోపీ ద్వారా ప్రొస్టేట్, యురెత్రా, యూరోడైనమిక్ పరీక్షలు చేస్తారు. ప్రొస్టేట్ క్యాన్సర్ అన్న అనుమానం ఉంటే ప్రొస్టేట్ యాంటిజెన్, లేదా నాడ్యులర్ ప్రొస్టేట్ పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అవసరాన్ని బట్టి ప్రొస్టేట్ బయాప్సీ కూడా చేస్తారు. పార్కిన్‌సన్స్ లాంటి సమస్యలుంటే మూత్రంలో ఇబ్బందులకు మూత్రనాళ సమస్యలే కారణమా కాదా అన్నది నిర్ధారించుకోవడం తప్పనిసరి.

ఎలా చేస్తారు..?
మత్తుమందు ఇచ్చాక ఎండోస్కోప్ ద్వారా ప్రొస్టేట్, బ్లాడర్‌లను పరీక్షిస్తారు. తరువాత రిసెక్టోస్కోప్ అనే చిన్న సంచి లాంటి ట్యూబును ప్రొస్టేట్‌లోకి చొప్పిస్తారు. ఇది ప్రొస్టేట్ గ్రంథిలో అదనంగా పెరిగిన కణజాలాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసేస్తుంది. ప్రొస్టేట్ గ్రంథి చిన్న పరిమాణంలో ఉన్నవారిలో టీయూఐపీ టాన్స్‌యువూతల్ ఇన్‌సిషన్ ఆఫ్ ది ప్రొస్టేట్) చేస్తారు. యురెవూతాలో కెథటర్ అనే చిన్న ట్యూబును ఉంచి స్లైన్ ద్రావణాన్ని నెమ్మదిగా బ్లాడర్‌లోకి పంపిస్తారు. దీనివల్ల అక్కడక్కడ గడ్డలుగా మిగిలిపోకుండా నివారించవచ్చు. ప్రొస్టేట్ కణజాల ముక్కలన్నీ యూరిన్ ద్వారా వెళ్లిపోతాయి. ఆపరేషన్ తరువాత ఎరుపు రంగులో అంతా బయటకు వచ్చేస్తుంది. యూరిన్ మొత్తం శుభ్రం అయ్యేవరకు అంటే 48 నుంచి 72 గంటలు ఈ కెథటర్‌ను అలాగే ఉంచుతారు.

ఆపరేషన్ తరువాత...
ఆపరేషన్ తరువాత కోలుకోవడానికి రెండు నుంచి ఎనిమిది వారాల సమయం పడుతుంది. అప్పటివరకు మూత్రంపై కంట్రోలు లేకపోవడం లాంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉండవచ్చు. ఇవి కూడా కొన్నాళ్లకు పూర్తిగా తగ్గిపోతాయి. పెల్విక్ వ్యాయామాలు చేస్తూ, మందులు వాడితే ఈ సమస్యలూ ఉండవు. అయితే నాలుగు వారాల వరకు శృంగారానికి మాత్రం దూరంగా ఉండాల్సి వస్తుంది. ఎక్కువ బరువులు ఎత్తకూడదు. సమస్య వచ్చిన తరువాత వెంటనే చికిత్స తీసుకుంటే కోలుకోవడానికి కూడా ఎక్కువ సమయం పట్టదు. సర్జరీ తరువాత పది శాతం మందిలో మళ్లీ సమస్య రావచ్చు. అదేవిధంగా క్యాన్సర్ కూడా. అయితే సర్జరీ వల్లనే సమస్యలు వస్తాయనుకోవడం మాత్రం పొరపాటు. టీయూఆర్‌పీ చికిత్సలో ప్రొస్టేట్ గ్రంథిని మొత్తం తీసేయరు కాబట్టి ఏ సమస్య అయినా మళ్లీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆపరేషన్ తరువాత రెగ్యులర్‌గా యూరాలజిస్టును కలుస్తూ ఉండాలి.
                               క్యాన్సర్ - నిజాలు 

 విజ్ఞానం, వైద్యం ఎంతో అభివృద్ధి చెందినా ఇప్పటికీ కొన్ని వ్యాధులకు కచ్చితమైన పరిష్కారాన్ని కనుక్కోలేకపోతున్నాం. జీవిత కాలాన్ని పొడిగించుకోగలిగిన మానవుడు క్యాన్సర్‌కు ఆన్సర్ తెలుసుకోలేకపోతున్నాడు. ఇప్పటికీ తెలిసిన వారికో, బంధువులకో క్యాన్సర్ అన్న పదం వినగానే ఒళ్లు జలదరిస్తుంది. ఎన్నో సందేహాలు, భయాలు, అనుమానాలు వెంటాడుతాయి.

లక్షణాలు
MedicineandLife1st_CancerCeక్యాన్సర్ లక్షణాలు.. అది వచ్చిన అవయవాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అందరిలో అన్ని రకాల క్యాన్సర్‌లు కనిపించే సాధారణ లక్షణాలు అంటే క్యాన్సర్ ముదిరాక కనిపించే లక్షణాలు అని అర్థం చేసుకోవచ్చు. అవి తీవ్రమైన అలసట, జ్వరం, రోగనిరోధక శక్తి తగ్గటం, ఆకలి తగ్గటం, వాంతులు, విరోచనాలు, అకారణంగా బరువు తగ్గడం, రక్తహీనత.

గుర్తించడం ఎలా?
ముందే తెలుసుకోవడం లేదా శరీరం మొత్తంలో ఎక్కడైనా క్యాన్సర్ కణం ఉందా అని మొత్తంగా తెలిపే పరీక్షలు లేవు. ఏ అవయవానికి వచ్చిందని అనుమానం ఉంటే ఆ అవయవానికి సంబంధించిన పరీక్షలు వేర్వేరుగా ఉంటాయి. వీటిలో బయాప్సీ, ఎఫ్.ఎన్.ఎ. టెస్ట్, బ్లడ్ మార్కర్స్, ఎక్స్-రే, సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ, పీఈటీ స్కాన్ ఇలా రకరకాలుగా అవసరాన్ని బట్టి చూస్తూ ఉంటారు. ఒక్క సర్వైకల్ క్యాన్సర్‌ను మాత్రమే పాప్‌స్మీయర్ ద్వారా చాలా ముందుగా గుర్తించవచ్చు.

వ్యాక్సిన్ ఉందా
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు కారణం కచ్చితంగా హెచ్‌పీవీ వైరస్ అని తెలుసు కాబట్టి ఇది రాకుండా అమ్మాయిలకు వ్యాక్సిన్ ఉంది. 9 సంవత్సరాల నుంచి పెళ్లికాని అమ్మాయిలందరూ అంటే శృంగార జీవితం ప్రారంభం కాకముందే ఈ వ్యాక్సిన్ వేయించుకుంటే ఈ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. అండాశయం, (గొంతు క్యాన్సర్ రాకుండా కూడా ఈ వ్యాక్సిన్ పనిచేయవచ్చని 40 ఏళ్ల వరకు స్త్రీలు ఈ వ్యాక్సిన్ వేయించుకోవచ్చని డాక్టర్స్ సలహా ఇస్తుంటారు) హెపటైటీస్ సి వైరస్ తరచూ రూపాంతరం చెందుతూ ఉండటం వల్ల ఆ వైరస్ వచ్చే లివర్ క్యాన్సర్‌కు ఇంకా టీకాను కనుక్కోలేక పోయారు.

నివారణ లేదా?
సర్వైకల్ క్యాన్సర్‌కు తప్పితే మిగతా ఏ క్యాన్సర్‌కు కచ్చితమైన కారణం తెలియదు కాబట్టి నివారణ మన చేతుల్లో లేనట్లే. అయితే బాగా పీచు పదార్థాలుండే ఆహారం, వ్యాయామం, కాలుష్యానికి, కెమికల్స్‌కు దూరంగా ఉండటం, పొగతాగడం, ఆల్కహాల్ వంటి అలవాట్లకు దూరంగా ఉండడం, తరచూ ఇన్‌ఫెక్షన్‌కు గురికాకుండా చూసుకోవటం ద్వారా క్యాన్సర్ రాకుండా మన చేతుల్లో ఉన్నంత ప్రయత్నం చేసిన వారమవుతాము.

వంశపారంపర్యమా
mohanకచ్చితంగా చెప్పలేము కాని, రొమ్ము క్యాన్సర్ రక్త సంబంధికులలో ఉంటే మిగతా ప్రజలకంటే వీరిలో వచ్చే రిస్క్ ఎక్కువ. బీఆర్‌సీఏ-1, బీఆర్‌సీఏ-2 వంటి జీన్ మ్యూటేసణ పరీక్షల ద్వారా రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పసిగట్టవచ్చు. రొమ్ము క్యాన్సర్ బాధితులు 0 శాతం వంశపారంపర్యంగా లేనివారే కాబట్టి ప్రతి స్త్రీ 20 ఏళ్ల నుంచే రొమ్ము క్యాన్సర్ పై అవగాహన పెంపొందించుకొని, నెలసరి అయిన ఏడవ రోజున సబ్బు చేతులతో వేళ మధ్య భాగంతో రొమ్ములను పరీక్షించుకుని చిన్న, చిన్న గడ్డలు ఏమైనా తగులుతున్నాయా అని గమనించుకోవాలి. 30 ఏళ్ల నుంచి ఇతర పరీక్షలు, 40 ఏళ్లు పైబడ్డాక మమోగ్రాం వంటివి డాక్టర్ సలహా మేరకు ఏడాదికి కానీ, మూడు ఏళ్లకు ఒక సారి కానీ చేయించుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించి వెంటనే చికిత్స తీసుకోగలుగుతారు.

 

 ఫైబ్రాయిడ్స్ వల్ల సంతానలేమి

 
fibroidsగర్భాశయంలో ఏర్పడే గడ్డలను యుటరైన్ ఫైబ్రాయిడ్స్ అని అంటారు. సంతానం కలుగని దంపతుల్లో స్త్రీలకు సంబంధించిన అంశాల్లో గర్భాశయ గడ్డలు కూడా ఒక కారణం. దాదాపుగా 10 శాతం వరకూ సంతానలేమికి గర్భాశయ గడ్డలు కారణమవుతున్నాయి. పిల్లలను కనే వయసులో ఉన్న మహిళల్లోనూ, 35 సంవత్సరాల వయసు దాటిన మహిళల్లోనూ ఈ సమస్యను అధికంగా గమనిస్తుంటాం.

రక్తనాళాలు, గోడల నుంచి
గర్భాశయ గోడల నుంచి, గర్భాశయ రక్తనాళాలల నుంచి గడ్డలు ఏర్పడుతాయి. ఇవి గోళాకారంగా ఉంటాయి. వీటిని కప్పి ఉండే పొర ఏమీ లేకుండా గర్భాశయ కండరాల సహాయంతో వృద్ధి చెందుతాయి. గులాబీ తెలుపు కలిసిన వర్ణంతో ఉండి మిల్లీమీటర్ నుంచి సెంటిమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంటుంది.

ఎన్నోరకాలు
కొన్ని ఫైబ్రాయిడ్స్ గర్భాశయ గోడల మధ్యలో పెరుగుతూ పోతాయి. కొన్నిరకాల ఫైబ్రాయిడ్స్ గర్భాశయగోడలను దాటి వెలుపలికి పెరుగుతాయి. కొన్ని రకాలు గర్భాశయ గోడల నుంచి తయారైనప్పటికీ గర్భాశయంలోని కదలికల వల్ల గర్భాశయ కుహరంలోకి వెల్లిపోతాయి.

ఫలదీకరణ జరగదు
ఫైబ్రాయిడ్స్ కారణంగా అండం విడుదల సక్రమంగా ఉండదు. గర్భాశయ గడ్డలు గర్భాశయ నాళాలను మూసివేయడం వల్ల అండం విడుదలైనప్పటికీ గర్భశయ నాళాల్లోకి వెళ్లదు. అందువల్ల ఫలదీకరణ జరగదు. కొన్ని సార్లు గర్భకుహరంలో పెరిగిన గడ్డల కారణంగా కూడా శుక్రకణాలు అండాన్ని చేరనీయకుండా నిరోధిస్తుంటాయి. ఇది కూడా గర్భధారణ వైఫల్యానికి కారణమవుతుంది. ఫైబ్రాయిడ్ కారణంగా గర్భాశయంలో చీము చేరడం వల్ల గర్భం నిలిచే అవకాశాలు తగ్గిపోతాయి.

గర్భవూసావానికి ఇవీ కారణమే
సాధరణంగా గర్బాశయ గోడలను ఆధారంగా చేసుకొని పిండం ఎదుగుతుంది. కానీ గర్భాశయ గోడల్లో ఏర్పడిన గడ్డల కారణంగా పిండానికి పోషణ సరిగా అందక పోవడం వల్ల గర్భం దాల్చిన తొలిదినాల్లోనే గర్భవూసావం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఫైబ్రాయిడ్ మిల్లీమీటర్ల సైజులో ఉంటే గర్భవూసావం అయ్యే అవకాశాలు చాలా తక్కువనే చెప్పవచ్చు. ఫైబ్రాయిడ్స్ ఒకటికంటే ఎక్కువగా ఉన్నా, సైజు పెద్దవిగా ఉన్నా గర్భవూసావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఎందుకంటే
అధిక ఈస్ట్రోజన్ హార్మోన్ విడుదల కొన్ని రకాల గర్భనిరోధక మాత్రల వాడకం
నెలసరి సమయంలో అధిక రక్తవూసావం కావడం లేదా బుతుకాలం కొనసాగడం, నెలసరి క్రమబద్ధంగా లేకపోవడం

ఇలా తెలుసుకోవచ్చు
అల్ట్రా సౌండ్ స్కానింగ్ ద్వారా గర్భాశయ గడ్డల సైజు ఏర్పడిన ప్రదేశం గుర్తించ వచ్చు.

లక్షణాలు
పొత్తికడుపు నొప్పి, పొట్ట బరువుగా అనిపించడం
ఫైబ్రాయిడ్స్ పెద్దవిగా ఉన్నపుడు తీవ్రంగా పొత్తికడుపు నొప్పి ఉంటూ అధిక రక్తవూసావంతో అత్యాయిక చికిత్స కూడా అవసరమవుతుంది.

చికిత్స
హర్మోన్ చికిత్సలు అందించడం ద్వారా ఫైబ్రాయిడ్ సమస్యను కొంత వరకు పరిష్కరించవచ్చు. గొనడోవూటాఫిన్ హార్మోన్లను ఇవ్వడం ద్వారా ఫైబ్రాయిడ్ల పరిమాణం తగ్గించవచ్చు. కానీ దీని వల్ల జనేంవూదియం పొడిబారడం, నిద్ర లేమి వంటి దుష్ప్రభావాలు ఏర్పడే అవకాశం ఉంది. హార్మోన్ థెరపిల వల్ల దుష్ప్రభావాలు ఎక్కువ కాబట్టి ఫైబ్రాయిడ్‌ల చికిత్సలో సర్జికల్ చికిత్సకు వెళ్లడమే మంచిది. సర్జరీ ద్వారా ఫైబ్రాయిడ్లను తొలగించడం వల్ల సమస్య నుంచి శాశ్వత విముక్తి దొరుకుతుంది. ఫైబ్రాయడ్ సమస్య ఉన్న వారు నిపుణులైన గైనకాలజిస్టులను సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది.
డాక్టర్ సునీత ఇలినాని
గైనకాలజిస్టు
సూర్య ఫర్టిలిటీ సెంటర్
 8885 013 100

కరోనరి హార్ట్‌ డిసీజెస్‌ రాకుండా

మనశరీరంలోని ప్రతీ అవయవానికి రక్తం సరఫరా చేయ డానికి కొన్ని ప్రత్యేక రక్తనాళాలు ఉంటాయి వాటి ద్వారా ఆయా అవయవాలకి రక్తప్రసరణ జరుగుతుంది. రక్తం ద్వారానే ఆహారం, ఆక్సిజన్‌ సరఫరా అన్ని కణాలకు జరుగు తుంది. రక్తం చేరని ప్రాంతానికి ఇవి చేరక ఇబ్బంది పడతాం.రక్తం అంతా గుండె ద్వారా ఇతర అవయవాలకు చేరుతున్నా, గుండె తనకు రక్తం సరఫరా చేసే నాళాలైన ‘కరొనరి ఆర్టెరీ’ శాఖల ద్వారా వచ్చే రక్తాన్నే తన కోసం ఉపయోగించుకుంటుంది. ఈ కరొనరి ఆర్టెరీ శాఖలలో అడ్డంకులు ఏర్పడితే గుండె కండరాలకి రక్తం సరిగ్గా సరఫరా కాదు. దాంతో కండరాలు నీరసించి గుండె కొట్టుకోవడం కష్టమవుతుంది. గుండె రక్తనాళాలైన కరొనరి ఆర్టెరీ శాఖలలో ‘ఎథిరోస్ల్కీరోసిస్‌’తో పూడుకు పోవడం జరిగి తద్వారా గుండె రక్తప్రసరణ తగ్గడాన్ని కరొనరి ఆర్టెరీ హార్ట్‌డిసీజ్‌ అంటారు. గుండె రక్తనాళాల్లో ఈ మార్పు ఎలా వస్తాయంటే ముందు కొవ్వు కొద్ది కొద్దిగా రక్తనాళాలలోపలివైపు పేరుకుపోతుంది. ఆ తరువాత లిపిడ్‌, పైబర్‌ కూడా పేరుకుపోయి గట్టిపడతాయి. ఇవి సాధారణంగా రక్తనాళాలు మలుపుతిరిగేచోట కానీ, చీలేచోటగానీ ఏర్పడతాయి.

ఈ ప్లేక్స్‌ రకరకాలుగా ఉంటాయి. కొన్ని కొవ్వు కణాల్తో పెద్దగా ఏర్పడి సన్నటిక్యాప్‌ కప్పినట్లు పెరుగుతాయి. ఇవి చిదిమిపోవచ్చు. ఇలా రక్తనాళాల్లో అడ్డంకులేర్పడతాయి. పూర్తిగా రక్తనాళాల్లో అడ్డంకిగా ఏర్పడి ‘మయోకార్డియల్‌ఇన్‌ఫె‘న్‌’ ఏర్పడవచ్చు. మరికొన్ని సందర్భాల్లో ఈ ప్లేకు ఫైబ్రస్‌ ప్లేక్‌ అవుతాయి. ఆర్టరీ శాఖలలో విస్తరిస్తాయి. ఈ విధంగా కరొనరీ ఆర్టరీలో కొవ్వు 50శాతం కన్నా ఎక్కువ పేరుకుపోతే అక్కడినుంచి రక్తసరఫరా తగ్గి ఆప్రాంతంలో గుండె కండరాలు దెబ్బతింటాయి. అంతకన్నా ఎక్కువ పేరుకుపోతే గుండె కండరాలు ఇంకా ఎక్కువ దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఇలా కరొనరి ఆర్టరీ డిసీజెస్‌ వస్తాయి. దీన్ని ప్రారంభదశలో గుర్తించి, దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మామూలు కన్నా పొగతాగే వాళ్ళలో కరొనరి హార్ట్‌ డిసీజెస్‌ వచ్చే రిస్క్‌ రెండు లేక మూడు రెట్లు ఎక్కువ. సిగరెట్లు తాగడం మానేస్తే ఈ రిస్క్‌ కూడా క్రమంగా తగ్గుతుంది. కాబట్టి ధూమపానం అలవాటు ఉంటే మానుకోవడం మంచిది.
కరొనరి హార్ట్‌ డిసీజ్‌కి మరో రిస్క్‌ కొలెస్ట్రాల్క్త్రంలో పెరగడం. కొలెస్ట్రాల్‌ వల్ల ఈ జబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువ. మన శరీరంలో లోడెన్సిటి లైపోప్రొటీన్‌ (ఎల్‌.డి.ఎల్‌) తక్కువగా ఉండాలి. ర‘ణ కల్పించే హై డెన్సిటి లైపోప్రొటీన్‌ (హెచ్‌.డి.ఎ) ఎక్కువగా ఉండాలి. అలా కాకుండా ఎల్‌డిఎల్‌ పెరిగినా, హెచ్‌డిఎల్‌ తగ్గినా కూడా రిస్క్‌ఎక్కువే! ట్రెౌగ్లిజరైడ్స్‌ ఎక్కువై వాటితోపాటు ఎల్‌డిఎల్‌ పెరిగి హెచ్‌డిఎల్‌ తగ్గడంతో రిస్క్‌ ఎక్కువవుతుంది. మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు ఎక్కువ కొలెస్ట్రాల్‌ స్థాయిని తట్టుకోగలరు. ఎందుకంటే బహిష్టు ఆగేవరకు ప్రత్యేక హార్మోన్లు ర‘ణ ఉంటుంది. ఈ కొలెస్ట్రాల్‌ పెరగడానికి రెండు ప్రత్యేక కారణాలున్నాయి. 1) వంశపారంపర్యంగా వచ్చేవి. 2) ఆహారం ద్వారా వచ్చేవి. చిన్న వయస్సులో కూడా కొన్ని జీన్స్‌ దెబ్బతినడం వల్ల వంశపారపర్యంగా ‘హైపర్‌ లిపిడిమియా’తో బారినపడుతుంటారు.

దీంతో కరొనరి హార్ట్‌ డిసీజెస్‌ చిన్న వయస్సులో వచ్చే రిస్క్‌ ఉంది. ‘సేచురేటెడ్‌’ ఫ్యాట్స్‌ ఎక్కువగా తీసుకుంటే కొలెస్ట్రాల్‌ పెరిగే అవకాశం ఎక్కువ.అధిక బరువు, డయాబెటిస్‌, అధికరక్తపోటుల వల్ల కూడా గుండె రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది. డయాబెటిస్‌ ఉన్న వాళ్ళల్లో ఎథిరోస్ల్కీరోసిస్‌తో గుండెరక్తనాళాలు మూసుకుపోయే రిస్క్‌ ఎక్కువ. అధిక రక్తపోటు వల్ల కరొనరి డిసీజెస్‌ ఎక్కువ. రక్తపోటును తగ్గిస్తే ఆరిస్క్‌ తగ్గుతుంది.ఊబకాయం గుండె జబ్బులు రావడానికి ప్రధాన రిస్క్‌ ప్యాక్టర్‌గా గుర్తించారు. ఊబకాయాల వల్ల కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. ఎల్‌.డి.ఎల్‌ పెరిగి హెచ్‌.డి.ఎల్‌ తగ్గుతుంది. కాబట్టి బాడీమాస్‌ ఇండెక్స్‌ చెప్పిన దానికన్నా ఎక్కువ బరువు ఉండకుండా చూడటం అవసరం. బి.ఎం.ఐ అంటే బాడీమాస్‌ ఇండెక్స్‌ ఎత్తును బట్టి ఉండాల్సిన బరువును చెప్పడం. బి.ఎం.ఐ = బరువు కిలోగ్రాముల్లో /ఎత్తు మీటర్లలో అలాగుణించినప్పుడు 25కన్నా తక్కువ ఉండాలి.

ఛాతి చుట్టుకొలతని పిరుదుల చుట్ట కొలతతో పొల్చినప్పుడు ఆడవాళ్ళల్లో అయితే. 8 కన్నా ఎక్కువ ఉండకూడదు. మగవాళ్ళల్లో అయితే. 1 కన్నా ఎక్కువ ఉండకూడదు. ఈ రేషియో పెరిగిన కొద్దీ కరొనరి డిసీజెస్‌ రిస్క్‌ ఎక్కువ. సరైన ఎక్స్‌సర్‌సైజ్‌ లేకపోవడం కూడా కరొనరి హార్ట్‌ డిసీజెస్‌ వచ్చే రిస్క్‌ను పెంచుతుంది. వారంలో అయిదు రోజులు 20 నుంచి 30 నిమిషాల పాటు ఎక్స్‌సర్‌సైజులు చేయాలి. నడకైనా మంచిది. ఆల్కాహాల్‌ ఎక్కువ తీసుకున్నా ‘ట్రెౌగ్లిజరైడ్స్‌’ఎక్కువై లివర్‌ డిసీజ్‌తో పాటు కరొనరి డిసీజెస్‌ రావచ్చు. ఎక్కువగా స్ట్రాంగ్‌ కాఫీ తీసుకోవడం మంచిది కాదు. స్ట్రాంగ్‌ కాఫీ వల్ల సైనస్‌ టేకికార్డియా లేకపోతే ఎరిథ్మియా కలగవచ్చు. కాబట్టి కాఫీ తగిన మోతాదులో మాత్రమే తీసుకోవడం మంచిది. 
సాధారణంగా మెనూపాజ్‌ పీరియడ్‌ వచ్చేంతరకు వరకు ఆడవాళ్ళల్లో హార్మోన్స్‌ భద్రతను కలిగిస్తాయి. జీవనవిధానం మారడంతో ఇలాంటి లక్షణాలు దెబ్బతిని ఆడవాళ్ళల్లో చిన్నతనంలోనే కరొనరి హార్ట్‌డిసీజ్‌ వస్తుంది. కరోనరి హార్ట్‌ డిసీజెస్‌ వచ్చే కారణాలు తెలుసుకున్నాం. వీటిని బట్టి మనం జీవన విధానం ఎలా మార్చుకోవాలో తెలుసుకోవచ్చు. ధూమపానం, ఆల్కాహాల్‌, కాఫీ లాంటి అలవాట్లను మానేయటం మంచిది. కొలెస్ట్రాల్‌ పెరగని వి‘దంగా ఆహారపు అలవాట్లను తీర్చిదిద్దుకోవాలి. ఊబకాయం, డయాబెటిస్‌, అధిక రక్తపోటు లాంటి వాటిని అదుపులో ఉంచుకోవాలి. వ్యాయామం చేస్తుండాలి. ఇలా జీవన విధానాన్ని మార్చుకొంటే కరొనరి హార్ట్‌ డిసీజెస్‌ రాకుండా కాపాడుకోవచ్చు.

మానసిక ఒత్తిడితో కూడా కరొనరి హార్ట్‌డిసీజ్‌ రిస్క్‌ల్లో ఒకటి. టైప్‌-ఎ పర్సనాల్టీలో ఒత్తిడి ఎక్కువ. దీనితో వాళ్ళకి కరొనరి హార్ట్‌ డిసీజెస్‌ వచ్చే అవకాశం ఎక్కువ. టైప్‌ -ఎ పర్సనాలిటీ ఉన్న వాళ్ళలో పోటీతత్వం ఎక్కువ. వాళ్ళు అనుకున్న పని పూర్తికాకపోతే తీవ్ర ఒత్తిడికి గురవుతారు. యోగ, మెంటల్‌ రిలాక్సేషన్‌లతో కరొనరి హార్ట్‌ డిసీజెస్‌తో వచ్చే రిస్క్‌ తగ్గుతుంది.
సేకరణ :సూర్య దినపత్రిక 

స్పాండిలోలిస్థెసిస్‌
ఆటగాళ్ళలో కొంతమందికి వెన్ను క్రింది భాగంలో నొప్పి అంటారు. ముఖ్యంగా ఆడిన తర్వాత ఏక్స్‌రే తీరుుస్తే వెన్నుపూసలో ఒకదానిలో ప్రాక్చర్‌ కనిపిస్తుంది. ఇలా వెన్నుపూసలో ఒకటి విరగడాన్ని ‘స్పాండిలోలైసిస్‌’ అంటారు. సాధారంణంగా ఇలా ఫ్రాక్చర్‌ నడుము క్రింది భాగంలోని అరుుదవ లంబార్‌ వెన్నుపూసలో జరుగుతుంది. ఇలా విరిగిన వెన్నుపూసల మీద పైనుంచి భారం పడటంతో ఇది ప్రక్కకు కదులుతుంది. ఈ స్థితిని ‘స్పాండిలోలిస్థసిస్‌’ అంటారు. మరికొంచెం ప్రక్కకు కదిలితే ఈ వెన్నుపూస నరాలమీద ఒత్తిడిని కలిగిస్తుంది. దాంతో విపరీతమైన నొప్పి కలుగుతుంది. శస్తచ్రికిత్సలో ఈ స్థితిని సరిచేయాల్సి ఉంటుంది. 
స్పాండిలోలిస్టసిస్‌ వంశపారపర్యంగా కూడా వస్తుంటుంది. వెన్ను పూసలు పల్చగా ఉన్నవాళ్ళల్లో కూడా వెన్నముక ఇలా విరగడం జరుగుతుంటుంది. వెయిట్‌లిఫ్టింగ్‌ చేసేవాళ్ళు, ఫుట్‌బాల్‌ ఆడేవాళ్ళు, జిమ్నాస్టిక్స్‌లోనూ వెన్ను కింద భాగంలోని పూసల మీద ఒత్తిడి ఎక్కువవుతుంది. స్ట్రెస్‌ ఎక్చర్‌ కలుగుతుంది. ఇలాంటి ఇబ్బంది ఉన్నవాళ్ళలో నొప్పి నడుం కిందిభాగంలో కనిపించడంతో కండరాల నొప్పి అనుకుంటారు. స్పాండిలోలిస్థసిస్‌ వల్ల స్పాజమ్‌ ఏర్పడి, నడుం కింద భాగం స్టిఫ్‌ అవుతుంది. దాంతో ఫ్రాక్చర్‌లోనే మార్పు వస్తుంది. వెన్నుపూస ఎక్కువగా ప్రక్కకి జరగడంతో నరాల మీద ఒత్తిడి కలుగుతుంది. వెన్నుపూసల మధ్య నరాలు విస్తరించడానికి ఉండే దారి సై్పనల్‌ కెనాల్‌ సన్నమవుతుంది. సిటిస్కాన్‌ లేక ఎమ్‌ఆర్‌ఐ తీయించి, చూసి, పరిస్థితిని సరిగ్గా తెలుసుకోవచ్చు.

ఉన్న తేడాని బట్టి చికిత్స ఎలా చేయాలో నిర్ణయిస్తారు. ఎందుకు స్పాండిలోలైసిస్‌ వచ్చింది తెలుసుకోవడానికి వాటిని ఆపేయాలి. ఇబుప్రాఫెన్‌ లాంటి యాంటి ఇన్‌ప్లమేటరీ మందుల్ని నొప్పి తగ్గడానికి వాడతారు. అవసరమైతే నడుం క్రింది భాగంలో ‘ెల్ట్‌ పెట్టుకోమంటారు. ఫిజియోథెరపీ చేయమంటారు. స్ట్రెచ్చింగ్‌, స్ట్రెనైనింగ్‌ ఎక్సర్‌సైజెస్‌తో నడుం క్రింది భాగంలో నొప్పిని పోగొట్టడమే కాకుండా, భవిష్యత్తులో నొప్పి కలుగకుండా కాపాడవచ్చు. ఎక్స్‌రేలు వరుసగా తీయస్తూ వెన్నుపూసల స్థితిని తెలుసుకోవచ్చు. అప్పటికీ నొప్ప తగ్గకపోతే శస్తచ్రికిత్స తప్పనిసరి. వెన్నుపూస, శాక్రమ్‌లను ప్యూజ్‌ చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి లోపల స్క్రూస్‌, రాడ్స్‌ పెట్టి పూజన్‌ చేయాల్సి రావచ్చు. శస్తచ్రికిత్సతో స్వస్థత చేకూరుతుంది. 

మెడనొప్పి
మెడనొప్పితో చాలామంది బాధపడుతుంటారు. ముఖ్యంగా 50 సంవత్సరాలు పైబడిన వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. మన శరీరంలో మిగతా భాగాలలాగే మెడలోని సరె్వైకల్‌ సై్పన్‌లో ఎముకలు వయస్సుతో పాటు క్రమంగా అరుగుతాయి. ఆర్థరైటిస్‌తో లిగమెంట్స్‌కు, డిస్కకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. వెన్నుపాములోని పూసల మధ్య నరాలు ప్రయణించడానికి వీలుగా ఉన్న నాళం సన్నమై, నరాల మీద వత్తిడి పడుతుంది. దీనిని స్టినోసిస్‌ అంటారు. ఇది మెడ ప్రాంతంలోనూ కలుగవచ్చు. దెబ్బల వలన వెన్నుమీద ఒత్తిడి కలుగుతుంది. ఈ మెడ నొప్పి కొద్ది పాటి నుంచి తీవ్ర స్థాయి వరకూ ఉండవచ్చు. మెడ నిలపడమే కష్టమైపోతుంది. 

చికిత్స 
సరె్వైకల్‌ స్పాండిలోసిస్‌ ఉంటే ఈ లక్షణాలు నెలల కొద్దీ సాధించవచ్చు. లక్షణాలు తక్కువ స్థాయిలో ఉంటే మందులు, ఫిజియోథెరపి లాంటి వాటితో చికిత్స చేస్తారు. నొప్పి తీవ్రంగా ఉంటే మెడలోని వెన్నుదెబ్బతింటే శస్తచ్రికిత్స అవసరం కావచ్చు. డిస్క్‌ను తీసివేయడం వంటి చికిత్స చేస్తారు. 

రాడిక్యులోపతి
నరాలు మొదట్లో తగిలిన దెబ్బతో నరాలు చివర నొప్పి కనిపిస్తుంటుంది. ఎందుకంటే అక్కడ స్పర్శజ్ఞానం వుంటుంది కను. ఉదాహరణకు మెదడులోని వెన్నుపాము పూసల్లో లేదా డిస్క్‌ ఇబ్బంది కలిగితే చేతుల్లో, భుజాల్లో , మణిట్టులో జాలువారడం, నొప్పి కలుగడం వంటి లక్షణాలుంటాయి. మెడలోని వెన్నులో ప్రారంభమైన నరాలు చేతుల్లోకి వ్యాపిస్తాయి కనుక నొప్పి చేతుల్లోకి వ్యాపిస్తుంది. చాలాకారణాల వల్ల మెదడులోని వెన్నులోని నరాలపై ఒత్తిడి పడుతుంది. ఈ సరె్వైకల్‌ రాడిక్యలోపతికి కారణాలు మెడ ప్రాంతంలోని వెన్ను డిస్క్‌లో దెబ్బతినడంతో లోపలి నరాలపై ఒత్తిడి పడుతుంది. వెన్ను లోపలి నరాలు విస్తరించే దారి సన్నం కావడంతోనూ నరాలపై ఒత్తిడి పడుతుంది. 

డిస్క్‌ డిజనరేషన్‌తో నొప్పి రావచ్చు. మెదడును కదిలించి నొప్పి ఎక్కడ ఎలా వస్తుందో తెలుసుకుంటారు. ఎక్స్‌రేతో డీజనరేటివ్‌ డిస్క్‌లను పసిగట్టవచ్చు. అవసరమైతే ఎంఆర్‌ఐ పరీక్ష చేయిస్తారు. ముందు మందులు ఫిజియోథెరపితో వెన్ను నరాలమీద ఒత్తిడి తగ్గించడానికి ప్రయత్నిస్తారు. విశ్రాంతితో కొన్ని రోజులు మెడకు కాలర్‌ వేసుకోమంటారు. 
సరె్వైకల్‌ ట్రాక్షన్‌ లేదా మరే వ్యాయామైనా వైద్యులు సూచించిన ప్రకారం ఫిజియోథెరపిస్ట్‌ చేస్తాడు. కోల్డ్‌ థెరఫీ, ఎలక్ట్రికల్‌ స్టిమ్యులేషన్‌, ఐసోమెట్రిక్‌-స్ట్రెచింగ్‌ ఎక్సర్‌సైజెస్‌ చేయించవచ్చు. 6 నుంచి 12 వారాల లోపు తగ్గకపోతే శస్తచ్రికిత్స అవసరమవుతుంది. 

పరీక్షలు
మెడనొప్పితో బాధపడుతున్నప్పుడు రోగి తన వైద్యచరిత్రను డాక్టర్‌కు చెప్పాలి. ఈ సమాచారంతో డాక్టర్‌ సరె్వైకల్‌ స్పాండిలోసిస్‌తో కాక, మరేదైనా కారణంతో ఈ నొప్పి వస్తున్నదేమో తెలుసుగోలడు. భౌతిక పరీక్షలతో పాటు ఎక్స్‌రే, ఇతర ఇమేజింగ్‌ పరీక్షలతో మెడడు ప్రాంతంలోని వెన్ను పరిస్థితిని తెలుసుకోవచ్చు. మెడలో సరిగ్గా ఏ ప్రాంతంలో నొప్పి ఎక్కువగా ఉందో వైద్యుడికి చెప్పగలగాలి. ఎప్పటినుంచి ప్రారంభమైందో, క్రమంగా పెరుగుతున్నదా? తగ్గుతున్నదా? లేక అలాగే ఉంటున్నదా? అనే విషయాలు చెప్పాలి.

లక్షణాలు
సర్వేకల్‌ స్పాండిలోసిస్‌తో నొప్పి మాత్రమే కాక, మెడ కూడా బిగుసుకుపోతుంది. ఆనొప్పికి పైభాగాన భుజాలలో కూడా వ్యాపించవచ్చు. ఏదైనా పనిచేస్తుంటే నొప్పి తీవ్రతరం అవుతుంది. చేతుల్లో నీరసం, మొద్దుబారినట్లు ఉంటుంది. అరచేతులు, వేళ్ళకు కూడా నొప్పి వ్యాపించవచ్చు. కాళ్ళలో నీరసంతో నడవటం కష్టమవుతుంది. మెడను కదిలిస్తున్నప్పుడు శబ్దమనవచ్చు. మెడనొప్పితో మెడ కండరాలు పట్టుకోవడం, తలనొప్పి రావడం జరగవచ్చు. ఈ లక్షణాలతో అసహనం పెరుగతుంది. ఆలసట కూడా కలుగుతుంది. నిద్రాభంగమవుతుంది. పనిచేయలేని స్థితి కలుగవచ్చు.
సేకరణ :సూర్య దినపత్రిక 

ఆయాసం తగ్గడానికి...
అంతేకాదు శ్వాసక్రియలో ప్రధానంగా ఉండే ఊపిరితిత్తుల లోని పొరలు ఏ కారణం చేతనైనా రేగడం వల్ల కూడా ప్రధానంగా రావచ్చు. ఈ శ్వాసక్రియలో ప్రధానంగా ఉండే సమస్యల వల్ల ఊపిరితిత్తులు దెబ్బతినే అవకాశం ఉంటుంది.ఆయాసం ఉన్న పిల్లలు చాలా మంది ముక్కుతో ఊపిరి పీల్చుకోకుండా నోటితో పీలుస్తూ ఉంటారు. దీనికి కారణమేమిటంటే అక్కడి శ్వాసమండలిలోకి గాలి వెళుతున్న మార్గం మూసుకుపోవడం వల్ల గాలి ముక్కుతో పీల్చుకోలేక నోటితో పీల్చడం జరుగుతుంది. గాలి పీల్చలేకపోవడం వల్ల పిల్లలకు అయినా పెద్దలకైనా సరే నోటితో పీలుస్తారు. దీనితో పిల్లలు మరింత నీరసించి పోతారు. ముక్కు గొంతు జీర్ణాశయం వ్యాధుల వల్ల కూడా ఆయాసం తలెత్తవచ్చు. అయితే కొంతమందిలో కొన్ని పదార్ధాల వాసనలు, వాతావరణం పడవు. దాన్ని ఎలర్జీ అంటారు. దీని వల్ల కూడా గాలి అరలు దగ్గరగా సంకుచితమై ఆయాసం వస్తుంది. అతి నీరసం వల్ల రక్తం తగ్గినప్పుడు పాండు వ్యాధిలోనూ కూడా ఆయాసం వచ్చే అవకాశం ఉన్నది.
ఆయాసంగా ఉన్నవారు చల్లటి పదార్ధాలు, కూల్‌డ్రింక్‌, ఐస్‌ క్రీమ్‌లు, బెండకాయ, చేయదుంప, పెరుగు, కొబ్బరి,చేపలు, సొరకాయ, దుంపకాయలు, బచ్చలి కూర ఎక్కువగా పుల్లగా ఉన్న పదార్ధాలకు దూరంగా ఉండాలి. ముల్లంగి దుంప, గోధుమలు లేదా గోధుమపిండి, తేనే, వెల్లుల్లి నిరభ్యంతరంగా తినవచ్చు.అదే విధంగా ప్రతి రోజూ ఉదయం లేచిన అనంతరం ఉదయం, సాయంత్రం చిటికెడు పసుపు, ఒక చిటికెడు మెత్తని ఉప్పు,రెండు చిటికెల పిప్పళ్ళ చూర్ణం తిని వేడినీళ్ళు తాగడం మంచిది. దీని వల్ల క్రమంగా ఎలుర్జీ తగ్గిపోతుంది. అంతేకాకుండా ఉసిరికాయ పెచ్చులు, వరిపేలాలు, పటిక బెల్లం, నువ్వుపప్పు, నెయ్యి అన్నింటిని సమభాగాలుగా తీసుకుని వాటిని మర్దించి చిన్న చిన్న మాత్రలుగా చేసుకుని ఉదయం సాయంత్రం తీసుకుంటే క్రమంగా ఆయాసం తగ్గుతుంది. వేడి వేడి టి డికాషన్లో తొమ్మిది చుక్కలు నిమ్మరసం వేసుకుని తేనెకూడా కలుపుకుని వేడివేడిగా తాగాలి. దీని వలన ఉబ్బసం ఉన్నవారికి చాలా వరకు ఇది కూడా మందుగా పనిచేస్తుంది.

సేకరణ :సూర్య దినపత్రిక 

నడివయసులో నడుంనొప్పి


ఇది కటివాతం (నడుమునొప్పి) అనంతరం గానీ, లేక ప్రారంభం నుండి గానీ 30 నుండి 50 సంవత్సరాల వయస్సు గలవారికి అతి సాధారణంగా కలుగుతుంది. కటివాతంతో కలిపి చూస్తే మధ్య వయస్కుల్లో నూటికి 30 నుండి 90 మంది వరకూ ఈ వ్యాధి అనుభవించి ఉంటారని పరిశోధకుల అంచనా. ఇది మధ్య వయస్కులలో అధికంగా ఉండటం చేత, ఈ వ్యాధి మాటిమాటికీ బాధ పెట్టేది కావడం వల్ల వారి దైనందిన కార్యక్రమాలకు సహితం గైర్‌హాజరు కావడం జరుగుతున్నది. దీనివలన శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా కూడా నష్టపోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. 

లక్షణాలు
తీవ్రమైన వేదన, స్తబ్ధత, చురుకులు, లాగినట్లుండుట ఈ లక్షణాలు తుంటి నుండి ప్రారంభమై కటి ప్రదేశానికి క్రమంగా తొడలు, మోకాళ్ళు, పిక్కలు తరువాత పాదాల వరకూ వ్యాపిస్తుంటాయి. ఆయా ప్రదేశాల్లోని కండరాలు వాతం వలన వికృతి పొందటంతో నడక సహితం కష్టమవుతుంది. ఆయుర్వేదంతో ఈ లక్షణాలతో కూడుకున్న వ్యాధిని గృధ్రసీ వాతం అంటూరు. ఈ వ్యాధి ప్రధానంగా వాతం, కఫం, వికృతి చెందడం వల్ల కలుగుతుంది. గృథ్రసీ గృధ్ర అంటే గ్రద్ధ. ఈ వ్యాధిలో రోగి గ్రద్ధవలే ఒక కాలు పట్టి పట్టి పట్టి నడుస్తాడు. కనుక గ్రద్ధ లాంటి నడక కలిగించే వ్యాధి కాబట్టి గృధ్రసీ అన్నారు. ఈ వ్యాధి మొదటి దశలో కటి ప్రదేశాన్ని కదిలించినా, వంగినా, ప్రక్కలకు తిరిగనా పట్టినట్లుండి బాధ కలుగుతుంది. పెయిన్‌ కిల్లర్స్‌ వాడాల్సినంత తీవ్రత ఉడకపోయినా కటి ప్రాంతానికి నొప్పి పరిమితమై ఉంటుంది. 

రెండవ దశలో కటి ప్రాంతంలో నొప్పి పరిమితంగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడూ తొడ భాగాలకు ప్రసరిస్తూ ఉంటుంది. ఇక వ్యాధి తీవ్రావస్థలో ప్రక్కలకు తిరిగినప్పుడు నొప్పి ఎక్కువై నడుము ప్రాంతంలో ఉన్న పేవులపై ఉద్విగ్నత, కదలికలో అవరోధము, ఏ కొంచెం కదిలినా దాని వలన బాధ, దగ్గుట, తుమ్ముట మొదలైన వాటి వల్ల నొప్పి వంటి లక్షణాలు కలుగుతాయి. ఈ లక్షణాలు అకస్మాత్తుగా గానీ, ప్రారంభమైన కొంత కాలానికి గానీ ఏర్పడటం జరుగుతుంది. ఇది రెండు పాదాల్లో గానీ ఒకే పాదంలోగానీ సాధారణంగా కన్పిస్తూ ఉంటుంది. 

కారణాలు
ఆహారసంబంధమైనవి

ఆహార లోపాలు, సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం వల్ల గృధ్రసీనాడీ పోషణ సరిగా జరుగక ఈ వ్యాధి కలుగుతుంది. 
మానసిక కారణాలు
మానసిక వత్తిడులు, ఉద్వేగం, భయం, నిరాశ మొదలైన కారణాలు దీర్ఘకాలిక కటిగతపేశీ సంకోచమునకు దారి తీయడముతో దౌర్భల్యం, వేదన, పాద వేదనకు క్రమంగా కారణమవుతాయి. 
శారీరక కారణాలు
శరీరాన్ని వక్రంగా ఉంచడం, దెబ్బలు, దూకడం, అధిక భారాన్ని మోయడం, గుల్ఫాది మర్మలపై దెబ్బ తగలడం మొదలగునవే కాక వ్యాయామం చేయకపోవడం, గర్భిణీ, మధుమేహం, ఎముకుల టి.బి., సిఫిలిస్‌ లాంటి సుఖవ్యాధులు, కీళ్ళువాతం, వార్థక్యం, స్పాండిలైటిస్‌, ఎముకులు అరుగుట మొదలైనవి వ్యాధిని కలిగిస్తాయి. 
చికిత్స
చికిత్స ప్రధానంగా పాదాల్లోని కదలికవరోధాన్ని తగ్గించడం, సియాటికా నాడిపై వత్తిడిని తొలిగించడం వంటి వాటిపై కేంద్రీకృతమై ఉంటుంది. ఇది నాలుగు పద్ధతులు. 
1.ఆహార నియంత్రణ, 2. దిన చర్యలు క్రమబద్దీకరించడం, 3. ఔషధ ప్రయోగం, 4. పంచకర్మలు. 
1.ఆహార నియంత్రణ
వేపుడు, పెరుగు, పులుపు వంటి వాటిని అధికంగా సేవించడం ఆపుచేయాలి. క్రమం తప్పకుండా ఆహారం ఎక్కువగా నీరు, పీచు పదార్థాలు తీసుకోవాలి. 
2. దినచర్య క్రమబద్ధీకరణ
స్వల్ప వ్యాయామం హితకరం. అతేకాక చల్లటి తేమ వాతావరణానికి గురికాకుండా ఉండటం, గతుకుల్లో ప్రయాణాలు చేయకుండా ఉండటం, ఎక్కువసేపు నిలబడకుండా లేక కూర్చోకుండా ఉండటం, వెన్నును నిటారుగా ఉంచడం, మల మూత్రాది వేగాలను నియంత్రిచకుండా ఉండటం చేయాలి. 
3. ఔషధ ప్రయోగం
నిర్గుండి, అశ్వగంథ మొదలగు ఔషధ ద్రవ్యములతో తయారుచేయబడిన ఔషధాలు, తైలాలు, ఘృతాలు, టాబ్లెట్లు, లేహ్యాలు, చూర్ణాలు, ఆసనాలు, అర్షిష్టాల రూపంలో ప్రయోగించడం జరుగుతుంది. 
4. బాహ్య చికిత్సా పద్ధతులు
ఇందులో ప్రధానంగా పంచకర్మల ద్వారా అంటే విరేచనం, వస్తి మొదలగు వాటి ద్వారా దోష నివారణం చేయడం జరుగుతుంది. తద్వారా సియాటికా నాడిపై వత్తిడిని తగ్గించడమే కాకుండా వ్యాధి పునరాగమనం నియంత్రించవచ్చు. అభ్యంగం, పిజిఛిల్‌, ఎలకిడి, నవరకిడి, మర్మ చికిత్స మొదలగు కేరళీయ చికిత్సా పద్ధతుల ద్వారా అవసరానుసారం చికిత్స చేయడం జరుగుతుంది. 

తీవ్రమైన వేదన, స్తబ్ధత, చురుకులు, లాగినట్లుండుట ఈ లక్షణాలు తుంటి నుండి ప్రారంభమై కటి ప్రదేశానికి క్రమంగా తొడలు, మోకాళ్ళు, పిక్కలు తరువాత పాదాల వరకూ వ్యాపిస్తుంటాయి. ఆయా ప్రదేశాల్లోని కండరాలు వాతం వలన వికృతి పొందటంతో నడక సహితం కష్టమవుతుంది. ఆయుర్వేదంలో ఈ లక్షణాలతో కూడుకున్న వ్యాధిని గృధ్రసీ వాతం అంటారు. ఈ వ్యాధి ప్రధానంగా వాతం, కఫం వికృతి చెందడం వల్ల కలుగుతుంది

సేకరణ :సూర్య దినపత్రిక 

సైన సైటిస్‌


సైనస్‌లు కపాలంలో ఎముకల్లో గాలిని ఉంచడం వల్ల వాటి బరువును తగ్గిస్తారుు. ఇవి మాట్లాడేటప్పుడు తగ్గిన శబ్ధం రావడానికి కూడా తోడ్పదతారుు. అన్ని రకాల శ్వాసకోశ అంటువ్యాధులు సైనస్‌ల మీద ప్రభావం చూపుతారుు. ఒకవేళ సైనస్‌లు ఏ విధమైన అడ్డూలేకుండా ముక్కు రంధ్రాల్లోకి తెరుచుకుని ఉంటే అంటు త్వరగా తగ్గిపోతుంది. కానీ సైనస్‌ల నుండి స్రవించే స్రావాలు వాటి మార్గంలో అడ్డుపడటం వల్ల అంటువ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నారుు. దీనినే ‘సైనసైటిస్‌’ అంటారు. కొన్ని సార్లు ఈ అంటువ్యాధి చాలా ప్రమాదకరంగా కూడా మారవచ్చు. 


అక్యూట్‌ సైనసైటిస్‌ లక్షణాలు
సైనస్‌ ఉన్న భాగాల్లో నొప్పి, ఒత్తిడి కలగడం, చీముతో కూడిన స్రావాలు ముక్కు నుండి బయటకు రావడం, ముక్కు దిబ్బడ వంటివి ప్రధాన లక్షణాలు.
కారణాలు
1. ముక్కులో వచ్చే ఇన్‌ఫెక్షన్స్‌
సైనస్‌ను కప్పబడిన మ్యూకస్‌ మెబ్రేన్‌ ముక్కులోని మ్యూకస్‌ మెంబ్రేన్‌తో సంబంధం కలిగి ఉంటుంది. అందువలన ఎటువంటి అంటువ్యాధి అయినా ముక్కు నుండి చాలా సులభంగా సైనస్‌లకు చేరుతుంది. ఈ సైనస్లు ముక్కు ర్రంధాల్లోకి తెరుచుకొని ఉంటే అంటువ్యాధి త్వరగా తగ్గిపోతుంది. ఒకవేళ వాటిలో ఏదైనా అడ్డు ఉంటే, అంటువ్యాధి త్వరగా తగ్గదు. ఇది ముఖ్యంగా వైరస్‌ వల్ల వస్తుంది. 
2. ఈత కొట్టడం
ఒక్కొక్క సారి సూక్ష్మక్రిములు ఎక్కువగా ఉన్న నీళ్ళలో ఈతకొట్టడం వల్ల ఆ నీళ్ళు సైనస్‌లోకి ప్రవేశించి వ్యాధిని కలగజేస్తాయి. స్విమ్మింగ్‌ పూల్స్‌లో క్లోరిన్‌ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఆ గ్యాస్‌ ముక్కు ర్రంధాల ద్వారా సైనస్‌ల్లోకి చేరి సైనస్‌లోని మ్యూకస్‌ మెబ్రేన్‌ వాచేటట్లు చేస్తుంది. అది క్రమంగా ‘సైనసైటిస్‌’ని కలుగజేస్తుంది.
3. ట్రోమా
ఒక్కొక్కసారి సైనస్‌ల్ని తయారుచేసిన ఎముకలు విరగడం వల్ల వాటికి అంటు చేరి సైనస్‌ మూకోసాకు అంటును కలుగచేస్తుంది. దంతాల్లో వచ్చే ఇన్‌ఫెక్షన్‌ కూడా కలుగచేయవచ్చు. 
ఇతర కారణాలు
1. సైనస్‌లో సరైన వెంటిలేషను లేకపోవడం, సైనస్‌ల్లో అడ్డు
సాధారణంగా సైనస్‌ల్లో బాగా వెంటిలేట్‌ అయి ఉంటాయి. సైనస్‌ను కప్పి ఉంచిన మ్యూకోసా మూకస్‌ ద్రవాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ ద్రవాలు సీలియరీ మూమెంట్‌ వల్ల సైనస్‌ ఆస్టియాను చేరి అక్కడ నుండి ముక్కురంధ్రాల్లోకి చేరుతాయి. ఒకవేళ ఇలా జరగడానికి సైనస్‌ల్లో ఏదైనా అడ్డుకుంటే సైనస్‌లో తయారయ్యే పదార్దాలు అక్కడే నిలవ ఉండి సైనస్లో విధులకు ఆటంకం కలిగిస్తాయి. ముఖ్యంగా సైనస్‌లో నాసల్‌ పేకింగ్‌, స్ఫుటం మెక్క నిర్మాణంలో తేడా రావడం, మేలిగ్నెంట్‌/నియోప్లాసం వల్ల అడ్డు ఏర్పడుతుంది.
2. నాసల్‌ కేవిటిలో ద్రవాలు నిలువ ఉండటం
అప్పుడప్పుడు ముక్కులోని ద్రవాల చిక్కదనం వల్ల లేదా ఏదైనా అడ్డు ఉండటం వల్ల నాసాఫారింగ్స్‌లోకి వెళ్ళకుండా ఉండి, అవి అంటు కలుగజేస్తాయి.
3. పూర్వం వచ్చిన సైనసైటిస్‌ ఎటాక్స్‌
ఎక్కువ సార్లు సైనసైటిస్‌ రావటం వల్ల సైనప్‌ మ్యూకోసా దెబ్బతిని ఉండటం వల్ల మళ్ళీ సైనసైటిస్‌ వచ్చేటట్లు చేస్తుంది. 
4. వాతావరణం
వాతావరణం తేమగా, చల్లగా ఉన్నప్పుడు సైనసైటిస్‌ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
5. ఇతర అంటువ్యాధులు
పుష్టికరమైన ఆహారం తీసుకోకపోవటం, మీసిల్స్‌, చెకెన్‌పాక్స్‌, కోరింత దగ్గు వంటి అంటు వ్యాధులతో బాధపడటం, డయాబెటిస్‌ వంటి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నప్పుడు సైనసైటిస్‌ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. 
6. సూక్ష్మజీవులు
చాలా కేసుల్లో సైనసైటిస్‌ వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌లు ప్రారంభమై, తర్వాత నెమ్మదిగా బాక్టీరియా చేరి సైనసైటిస్‌ వ్యాధి వస్తుంది. ఇటువంటి హానికర సూక్ష్మజీవుల్లో స్ట్రెప్టోకోకస్‌ న్యూమోనియా, హీమోఫిలస్‌ ఇంఫ్లూయంజా, స్టెపైలోకోకస్‌ ఆర్‌.ఇ.యస్‌లు ముఖ్యమైనవి. సైనసైటిస్‌ వల్ల సైనస్‌ల్ని కప్పి ఉన్న మ్యూకస్‌ మెంబ్రేన్‌ ఇన్‌ఫ్లమేషన్‌కు గురవుతుంది. దాని వల్ల అవి ఎక్కువగా ద్రవాలను ఉత్పత్తి చేయడమే కాకుండా పాలీమార్సో న్యూక్లియర్‌ కణాలను కూడా తయారుచేస్తాయి. సైనస్‌ ఆస్టియమ్‌ ఈవిధంగా తయారైన ద్రవాలను బయటకు పంపించగలిగి, శరీరానికి తగ్గిన వ్యాధి నిరోధక శక్తి ఉన్నప్పుడు వ్యాధి త్వరగా తగ్గిపోతుంది. 

అలాకానప్పుడు అంటు అధికమై మూకోసల్‌ మెంబ్రేన్‌, సైనస్‌ ఎముకల మీద కూడా ప్రభావం కనబడుతుంది.దంతాలకు అంటు ఉన్నటైతే అది చాలా సులభంగా సైనస్‌లకు వ్యాపించి సైనసైటిస్‌లను కల్పించవచ్చు. అందువల్ల దంతాల్లోకి అంటును ముండుగానే గుర్తించి చికిత్స తీసుకోవాలి.యాధి నిర్ధారణవ్యాధి లక్షణాలు పూర్తిగా తెలుసుకోవడం వలన, సైనస్‌ ఎక్స్‌-రే ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చు.
నివారణ
1. ఎలర్జీ కలిగించే వస్తువుల్ని దూరంగా ఉంచాలి.
2. తగిన పోషకాహారం తీసుకోవడం, వ్యాయామం చేయటం, తగినంత విశ్రాంతి తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెంపొందించుకోవాలి.
3. శ్వాసకోశ అంటువ్యాధులతో బాధపడుతూ ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండాలి.
4. శ్వాసకోశ వెలుపలి భాగాల్లో అంటు 7-10 రోజుల కంటే ఎక్కువ కాలం ఉన్నటైతే వైద్యుని సలహా పాటించడం మంచిది.
5. సైనస్‌ల్లో నొప్పి ఉన్నా, ముక్కు నుండి వచ్చే స్రావాల రంగు మారినా, చెడువాసన వస్తున్నా, వెంటనే వైద్యుని సంప్రదించడం ఉత్తమం.

చికిత్స
1. వైద్యుని సహకారంతో అమాక్సిసిల్లిన్‌ లేదా ఆంపిసిల్లీన్‌ మందులు ఇవ్వవచ్చు.
2. పెన్సిలిన్‌ మందులకు రోగి అలర్జీ కలిగి ఉన్నట్లైతే ట్రైమితోప్రిం గానీ, సల్ఫోమితాక్సజోల్‌ అనే మందులు ఇవ్వవచ్చు.
3. ఓరల్‌ డ్రింక్సోరాల్‌, డిమోటాప్‌ ఇవ్వవచ్చు.
4. సెలైన్‌ యిరిగేషన్‌ వలన గట్టిగా ఉన్న స్రావాలు మెత్తబడి బయటకు స్రవించే అవకాశం ఉంది.
5. స్టీ పీల్చుకొనుట ద్వారా, ఎక్కువ ద్రవాలను లేదా పానీయాలను సేవించుట ద్వారా, లోకల్‌ హీట్‌ (వేడి తడిబట్టలను సైనస్ల మీద ఉంచటం) ద్వారా ముక్కు నుండి స్రావాలు బయటకు వచ్చి రోగికి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
6. సేషల్‌ స్ప్రేలు రోగికి కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి. కానీ, నేషల్‌ స్ప్రేలు అవసరంకంటే ఎక్కువ మోతాదులో ఉపయోగించినట్లయితే ముక్కు దిబ్బడ కలిగే ప్రమాదం ఉంది. కనుక రోగి జాగ్రత్తగా వీటిని ఉపయోగించవలెను.
సాధారణంగా సైనసైటిస్‌ మందుల ద్వారా తగ్గుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో మందులకి తగ్గనప్పుడు శస్తచ్రికిత్స ద్వారా ఈ వ్యాధిని తగ్గిస్తారు.

సాధారణంగా సైనస్‌ల్లో బాగా వెంటిలేట్‌ అయి ఉంటాయి. సైనస్‌ను కప్పి ఉంచిన మ్యూకోసా మూకస్‌ ద్రవాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ ద్రవాలు సీలియరీ మూమెంట్‌ వల్ల సైనస్‌ ఆస్టియాను చేరి అక్కడ నుండి ముక్కురంధ్రాల్లోకి చేరుతాయి. ఒకవేళ ఇలా జరగడానికి సైనస్‌ల్లో ఏదైనా అడ్డుకుంటే సైనస్‌లో తయారయ్యే పదార్దాలు అక్కడే నిలవ ఉండి సైనస్లో విధులకు ఆటంకం కలిగిస్తాయి. ముఖ్యంగా సైనస్‌లో నాసల్‌ పేకింగ్‌, స్ఫుటం మెక్క నిర్మాణంలో తేడా రావడం, మేలిగ్నెంట్‌/నియోప్లాసం వల్ల అడ్డు ఏర్పడుతుంది.
సేకరణ :సూర్య దినపత్రిక 
- డా నళినీకాంత్‌
ఇఎన్‌టి సర్జన్‌
గ్లోబల్‌ హాస్పిటల్‌, లక్డీకాపూల్‌, హైదరాబాద్‌
సెల్‌ : 92465 42464


Related Posts Plugin for WordPress, Blogger...

pages

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks