మన
శరీరంలో ఎక్కువ మొత్తంలో ఉండే మినరల్ మెగ్నీషియం. ఈ మెగ్నీషియం అధికంగా
లభించే చిక్కుళ్లు, జీడిపప్పు లాంటివి తినడం వల్ల పక్షవాతానికి దూరంగా
ఉండొచ్చంటున్నారు శాస్త్రజ్ఞులు.సుమారు 300 రకాల జీవరసాయనిక చర్యలకు మెగ్నీషియం కావాలి. దీన్ని బట్టే మన ఆరోగ్యంలో దీని పాత్ర అర్థం అవుతుంది. మన శరీరంలో ఉండే మెగ్నీషియంలో సగం వరకు ఎముకల్లోనే ఉంటుంది. మిగిలింది కణాలు, కణజాలాల్లోపల, అవయవాల్లో ఉంటుంది. కండరాలు, నాడుల పనితీరు సక్రమంగా జరగడంలో తోడ్పడే మెగ్నీషియం పక్షవాతం ముప్పునూ తగ్గిస్తున్నట్టు తాజా అధ్యయనాల్లో తేలింది. మెగ్నీషియం సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకునేవారిలో రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం తగ్గి పక్షవాతం ప్రమాదం తగ్గిపోతున్నట్టు గుర్తించారు. ఆహారం ద్వారా అదనంగా 100 మియగా. పెరుగుతున్న కొద్దీ పక్షవాతం ముప్పు 9 శాతం తగ్గుతున్నట్టు గమనించారు పరిశోధకులు. ఇది పొట్టుతీయని ధాన్యాలు, చిక్కుళ్లు, ఆకుకూరలు, బాదం, జీడిపప్పులో అధికంగా ఉంటుంది.