ayurbless కు స్వాగతం.మీ సమస్యను send your problem page ఫై click చేసి మాకు పంపించండి. మీరు అడిగే ప్రతి సమస్యకు మేము సమాదానం mail చేస్తున్నాము కొందరికి reply వెళ్ళడం లేదు .mail రాని వారు "మీ ప్రశ్నలు -మా సమాదానాలు " page చూడగలరు .facebook ద్వారా మా team తో chat చేసి మీ సందేహాలు అడగవచ్చు ayur bless ఫై click చేసి add friend చేసుకొని మాతో chat చేయవచ్చు.

ప్రియమైన ayurbless వీక్షికులకు,

మీకు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చిన మాకు mail చెయ్యండి.send your problem అనే పేజీ ఫై click చేసి మాకు తెలియజేయండి.మీ సమస్య తీవ్రతను బట్టి మేము వేగంగా స్పందించి మీకు ఆయుర్వేద పరిష్కారం తెలుపుతాము.ఆయుర్వేదంలో పరిష్కారం కాని సమస్య ఏదిలేదు.

కాన్సర్ రోగులకు కూడా పరిష్కారం తెలుపుతున్నాం.మా ayurbless websiteను మీరు bookmark చేసుకోండి.

సంవత్సరం మొత్తం కొత్త పోస్టింగ్ లతో మీముందు వుంటుంది.blog లోలేని చాలా విషయాలు website లో ఉంచడం జరిగింది.www.ayurbless.com చూడగలరు.

ఫైబ్రాయిడ్స్‌కి ఆయుర్వేదం

                  
గర్భాశయంలో ఏర్పడే గడ్డలను యుటరైన్ ఫైబ్రాయిడ్స్ అని అంటారు. సంతానం కలుగని దంపతుల్లో స్త్రీలకు సంబంధించిన అంశాల్లో గర్భాశయ గడ్డలు కూడా ఒక కారణం. దాదాపుగా 10 శాతం వరకూ సంతానలేమికి గర్భాశయ గడ్డలు కారణమవుతున్నాయి. పిల్లలను కనే వయసులో ఉన్న మహిళల్లోనూ, 35 సంవత్సరాల వయసు దాటిన మహిళల్లోనూ ఈ సమస్యను అధికంగా గమనిస్తుంటాం. గర్భాశయ గోడల నుంచి, గర్భాశయ రక్తనాళాల నుంచి గడ్డలు ఏర్పడుతాయి. ఇవి గోళాకారంగా ఉంటాయి. వీటిని కప్పి ఉండే పొర ఏమీ లేకుండా గర్భాశయ కండరాల సహాయంతో వృద్ధి చెందుతాయి. గులాబీ తెలుపు కలిసిన వర్ణంతో ఉండి మిల్లీమీటర్ నుంచి సెంటిమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. కొన్ని ఫైబ్రాయిడ్స్ గర్భాశయ గోడల మధ్య పెరుగుతూ పోతాయి. కొన్నిరకాల ఫైబ్రాయిడ్స్ గర్భాశయగోడలను దాటి వెలుపలికి పెరుగుతాయి. కొన్ని రకాలు గర్భాశయ గోడల నుంచి తయారైనప్పటికీ గర్భాశయంలోని కదలికల వల్ల గర్భాశయ కుహరంలోకి వెళ్లిపోతాయి.


గర్భస్రావం కావచ్చు..
988-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaఫైబ్రాయిడ్స్ కారణంగా అండం విడుదల సక్రమంగా ఉండదు. గర్భాశయ గడ్డలు గర్భాశయ నాళాలను మూసివేయడం వల్ల అండం విడుదలైనప్పటికీ గర్భశయ నాళాల్లోకి వెళ్లదు. అందువల్ల ఫలదీకరణ జరగదు. కొన్ని సార్లు గర్భకుహరంలో పెరిగిన గడ్డల కారణంగా కూడా శుక్రకణాలు అండాన్ని చేరనీయకుండా నిరోధిస్తుంటాయి. ఇది కూడా గర్భధారణ వైఫల్యానికి కారణమవుతుంది. ఫైబ్రాయిడ్ కారణంగా గర్భాశయంలో చీము చేరడం వల్ల గర్భం నిలిచే అవకాశాలు తగ్గిపోతాయి. గర్భాశయ గోడల్లో ఏర్పడిన గడ్డల కారణంగా పిండానికి పోషణ సరిగా అందక పోవడం వల్ల గర్భం దాల్చిన తొలిదినాల్లోనే గర్భవూసావం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఫైబ్రాయిడ్ మిల్లీమీటర్ల సైజులో ఉంటే గర్భవూసావం అయ్యే అవకాశాలు చాలా తక్కువనే చెప్పవచ్చు. ఫైబ్రాయిడ్స్ ఒకటికంటే ఎక్కువగా ఉన్నా, సైజు పెద్దవిగా ఉన్నా గర్భవూసావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

అధిక ఈస్ట్రోజన్ హార్మోన్, కొన్ని రకాల గర్భనిరోధక మాత్రల వాడకం, నెలసరి సమస్యలు వీటికి కారణం. సంతానలేమి, పొత్తికడుపు నొప్పి, పొట్ట బరువుగా అనిపిస్తుంది. ఫైబ్రాయిడ్స్ పెద్దవిగా ఉన్నపుడు తీవ్రంగా పొత్తికడుపు నొప్పి ఉంటూ అధిక రక్తవూసావంతో అత్యవసర చికిత్స కూడా అవసరమవుతుంది.

ఆయుర్వేదం బెస్ట్
గడ్డల పరిమాణం చిన్నవిగా ఉన్నపుడు ఏర్పడిన గడ్డలు గర్భాశయ గోడల మధ్య ఉన్నపుడు కూడా ఆయుర్వేద ఔషధాలు మంచి ఫలితాలనిస్తాయి. ఇందుకోసం సప్తవింశతి గుగ్గులు పూటకు రెండు, మూడు పూటలు వాడాలి. కాంచనార గుగ్గులు పూటకు రెండు, మూడు పూటలు వాడాలి. వీటితో పాటుగా ముందీ రసం గానీ కషాయం గానీ తేనెతో పాటుగా 10 -15 మిల్లీలీటర్లు వాడాలి. పొత్తికడుపులో నొప్పి అధికంగా ఉంటే హింగ్వాష్టక చూర్ణంను నెయ్యితో పాటుగా 3 గ్రాముల చొప్పున జత చేర్చి వాడాల్సి ఉంటుంది. బూడిద గుమ్మడి రసం కూడా ఫైబ్రాయిడ్ చికిత్సలో మంచి ఫలితాలనిస్తుంది. గడ్డల సైజును బట్టి, ఉన్న ప్రదేశాన్ని బట్టి 3 నుంచి 9 నెలల పాటు వైద్యం అవసరమవుతుంది.
Related Posts Plugin for WordPress, Blogger...

pages

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks